
NATIKALA SAMPUTI
₹45
In stock · 24 available
PublisherYIKKURTI NARASIMHA RAO
LanguageTelugu
నరజాతి చరిత్ర సమస్తం (నాటిక) సంక్షిప్త కధ అనగనగా ఒక పేదలకాలనీ! అందులో రిక్షాతొక్కి కుటుంబాన్ని పోషించుకునే ముసిలోడు. వాడికి మంచం పట్టిన భార్య, పెళ్ళీడుకొచ్చిన కూతురు, పెళ్ళయి పెళ్ళాం వదిలేసిన తాగుబోతు జులాయి కొడుకు. కొడుకు వయసువాడే బావమరదీ, సమాజంలో కుళ్ళును చూసి సహించలేక కల్తీ సారాతో తన ఆవేశాన్ని జోకొడుతూ మార్చురీలో తోటీగా పనిచేసే తమ్ముడు భూషణం. అన్నట్టు ప్రభుత్వం ఒకప్పుడు గుడిశ వేసుకోవడానికి ఇచ్చిన పట్టాభూమి కూడా ముసిలోడి ఆస్థే! అయితే ఇప్పుడా పట్టా భూమి ఆవూరి నడిసెంటర్లో విలువైనదిగా మారడంతో, చుట్టుప్రక్కల పట్టా భూములన్నీ కొని ఈ ముసిలోడి పట్టాభూమిని కూడా కబళించాలని చూసేరాయుడు ఈనాటికలో కనుపించని విలన్. ముసిలోడి పాకను రాయుడు ఏవిధంగా కబ్జా చేయడానికి ప్రయత్నించాడో, అందుకు ముసిలోడి స్పందన ఏమిటో పేదలకు భూములు - నివాసగృహాలు ప్రభుత్వం ఉచితంగా సమకూర్చినా ఆ తరువాత పరిణామాలు ఏమిటో నరజాతి చరిత్ర సమస్తం నాటిక కధా వస్తువు. పాత్రలు 1. ముసిలోడు 50 సం||లు, రిక్షా త్రొక్కి జీవించే బడుగుజీవి. 2. భూషణం 45 సం||లు, ప్రభుత్వ హాస్పిటల్లో ‘తోటీ' ఉద్యోగి 3. కోటీసు 25 సం॥లు, ముసిలోడి కొడుకు, పని లేని అమాయకుడు. 4. దాసు 25 సం॥లు, పాలిష్వాలా, ముసిలోడికి బావమరిది. తలలు మార్చే రకం. 5. అమ్ములు 18 సం॥లు, ముసిలోడి కూతురు. దాసుచేత మోసగించబడిన మంచి అమ్మాయి.