
NAVALA NAIVEDYAM
₹80
In stock · 24 available
PublisherAVIRBHAVA PRACHURANA
LanguageTelugu
ఆ ముఖం సమీక్షలకు-పుస్తక పరిచయాలకు విమర్శలకు సాహిత్యంలో విశిష్ట స్థానం ఉన్నా, దాదాపు ఈ మూడింటి కర్తవ్యం మాత్రం రచనల విశిష్టతను, ఆ క్రమంలో తలెత్తే అపశ్రుతులను క్షుణ్ణంగా పరిశీలించడానికే. పుస్తక పఠనం తక్కువైపోతున్న కాల ప్రభావంలో 'సెలక్టివ్ రీడింగ్' కు ప్రాధాన్యత పెరిగింది. మంచి పుస్తకం గురించి ఎలాగో తెలుసుకుని చదివే ఆసక్తి ఉన్నవారు చదవడం సహజమే. తెలుగు సాహిత్యంలో వందల్లో రచయితలు ఉన్నా, పదుల్లో మాత్రమే ప్రసిద్ధి చెందిన వారు ఉండటానికి కారణం వారి ప్రతి రచనలోనూ తమను తామో లేక ఇతరులనో అనుకరించకపోవడం వల్ల అని ఓ కారణంగా చెప్పుకోవచ్చు. ఓ రచయిత సాహిత్యం మొత్తం చదవాలంటే ఆ రచయిత రచనల్లో ఖచ్చితంగా కొన్ని ప్రత్యేకతలు ఉండి తీరాలి. అటువంటి ప్రత్యేక రచయితే సింహప్రసాద్ గారు. 1973లో తన సాహితీ ప్రస్థానాన్ని మొదలు పెట్టి నేటి వరకు కూడా దానిని కొనసాగిస్తూ ఉన్న ఆయన రచనల్లో ఆత్మీయత, బాధ్యత, ఆవేదన ఉన్నాయి. రచయితగా ఆయన రచనల గురించి ఎప్పుడూ బహుమతి పొందిన రచనల్లో చూడటం వల్ల రచనలు చదవకపోయినా, ఎప్పటికైనా చదవాల్సిన రచయితే అని ప్రథమంగా కలిగిన భావన. ఓ పుస్తకం చదివాక రచయిత దృక్కోణాన్ని అర్థం చేసుకున్నాక, ముఖ్యంగా నవలలకు ఆయన ఎన్నుకునే అంశాల వల్ల తన రచనల ద్వారా తాను ఏం చెప్పదలచుకున్నారో స్పష్టంగా తెలిసిన రచయిత అనే గౌరవం కలిగింది. ఆ గౌరవమే ఆయన రచనల్లో కొన్నింటి గురించి చదివి, నాకు అనిపించిన భావాలను, ఈ సమీక్షల ద్వారా చెప్పే ప్రయత్నం చేసేలా చేసింది. నవలా రచన సాధారణమైన అంశం కాదు. ముఖ్యంగా సామాజిక అంశాల మీద రాస్తున్నప్పుడు రచయిత ఓ సమస్య వల్ల తలెత్తే నష్టాలను మాత్రమే కథనంలో స్పష్టం చేస్తే సరిపోదు, ఆ కథనంలోనే సమాజంలో పరిష్కారం అవ్వని సమస్యలకు ఆశావాహ దృక్కోణాన్ని సూచించగలగాలి. ఆ దృక్కోణం సగటు మనిషి జీవితంలో ఆచరణకు దగ్గరగా ఉండాలి. ఆదర్శవాదం కన్నా యథార్థ వాదానికి ప్రాధాన్యతను ఇవ్వగలగాలి. నవలా నైవేద్యం