
NAVALA PRAJALU
by VALLAMPATI VENKATA SUBHAIAH
₹100
In stock · 796 available
PublisherVISALAANDHRA PUBLISHING HOUSE
LanguageTelugu
"రాల్ఫాఫాక్స్ ప్రసిద్ధ బ్రిటిష్ అభ్యుదయ రచయిత, కమ్యూనిస్టు. ఆయన 37-38 స్పెయిన్ అంతర్యుద్ధంలో "ఇంటర్నేషనల్ బ్రిగేడ్"లో పాల్గొని ప్రాణాలు అర్పించిన మహాయోధుడు." "మానవజాతి చరిత్రలో ఎన్నో కొత్తకళలు (ఉదాహరణకు సినిమా) పుట్టాయి. కానీ ఇంతవరకూ ఏ కళ కూడా పూర్తిగా నశించిపోలేదు. తన చైతన్యాన్నీ, వాస్తవిక ప్రపంచం పట్ల తన సంవేదననూ అభివృద్ధి చేసే ఏ అంశాన్ని కూడా మానవుడు జారవిడుచుకోడు. నవల కొత్త కళే కావచ్చు. కానీ దాని వేళ్ళు సుదూరగతంలో ఉన్నాయి. ప్రాచీన గ్రంథాలైన “టిమాల్కియోస్ బాంక్వెట్,” "ఫ్నీ అండ్ చోలీ" వద్దనో, మరింత వెనక్కు వెళ్ళితే సుప్రసిద్ధ గ్రీకు చరిత్రకారుడు హెరొడోటస్ (క్రీ.పూ. 5వ శతాబ్దం) వద్దనో నవల చరిత్ర ప్రారంభమౌతుంది. కానీ స్వతంత్ర ఆధునిక సాహిత్య ప్రక్రియగా నవల మన నాగరికతకు సంబంధించి మాత్రమే. సొంత నిర్మాణ సూత్రాలను కలిగి, అందరి మెప్పునూ, ఆమోదాన్ని పొందిన సాహిత్య ప్రక్రియ అయిన నవల మన నాగరికతకు మరీ ముఖ్యంగా ముద్రణా యంత్ర యుగానికి చెందిన వస్తువే.” "సాహిత్యంలో కొద్దిభాగం మాత్రమే వాస్తవికత. ఈ సూత్రం నాటకానికి కూడా వర్తిస్తుంది. అంతమాత్రంచేత కళగా నాటకానికున్న ప్రత్యేక గాంభీర్యాన్ని కాదంటున్నామని భావించకూడదు. నవల కేవలం కల్పనాత్మకమైన వచనం మాత్రమే కాదు. అది మానవ జీవితానికి సంబంధించిన వచనం. మానవుణ్ణి మొత్తంగా తన పరిధిలోకి తీసుకొని, అతణ్ణి సంపూర్ణంగా చిత్రించటానికి ప్రయత్నించిన మొట్టమొదటి కళారూపం నవల. మానవుడి రహస్య జీవితాన్ని దృశ్యమానం చేయగలిగిన శక్తి నవలకు ఉంది. సుప్రసిద్ధ రచయిత, విమర్శకుడు ఇ.ఎమ్. ఫార్స్టార్ - నవలకూ, ఇతర కళారూపాలకూ ఉన్న తేడా, నవలకున్న ప్రత్యేకతా ఇదేనని చెప్పాడు. కవిత్వం, నాటకం, సినిమా, చిత్రలేఖనం, సంగీతం మొదలైన కళలు చూపించే జీవిత వాస్తవికతకూ, నవల చూపించే జీవిత వాస్తవికతకూ చాలా తేడా ఉంటుంది.” ॐ శ్రీ విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్ చంద్రం బిల్డింగ్స్, చుట్టుగుంట, విజయవాడ - 520 004.