NAVARATNA - DHARMA SINDHU by NAVARATNA BOOK HOUSE Telugu book cover

NAVARATNA - DHARMA SINDHU

by NAVARATNA BOOK HOUSE

₹650
In stock · 5 available
PublisherNAVARATNA BOOK HOUSE
LanguageTelugu
ISBN9789387824294
ధర్మసింధు ॐ గ్రంథకర్త, పరిష్కర్తల విషయము లెక్కకు మిక్కిలిగా ఉన్న ధర్మశాస్త్ర గ్రంథాలలోని సారూప్యంగా ఉన్న అంశాలన్నీ ఒకచోట చేర్చి, సముద్రం వలె అనంతంగా దీన్ని తీర్చిదిద్ది నందువల్ల దీనికి 'ధర్మసింధు' అని పేరుంచడం దీని నామ సార్థక్యాన్ని సూచిస్తున్నది. దీనిని రచించిన వారు-కాశీనాథోపాధ్యాయుడను కొంకణ దేశస్తుడు. దీని రచనాకాలం-1809. (దీనిలోనే ఉటంకించబడిన ఒక శ్లోకం ద్వారా గ్రహించవచ్చు.) శ్రీ కాశ్యుపాధ్యాయ వరో మహాత్మా బభూవ విద్వద్విజ సార్వభౌమః, తస్మాదుపాధ్యాయ కులవతంసౌ యజ్ఞేశ్వరోనంత ఇమావభూతాం యజ్ఞేశ్వరో యజ్ఞవిధాన దక్షో దైవజ్ఞ వేదాంగ సుశాస్త్ర శిక్షః భక్తోత్తమోనంత గుణైకథానంత హ్వయోనంత కళావతారః, ఏషాత్యజజ్జన్మభువం స్వకీయాం తాం కొంకణాఖ్యాం సువిరక్తి శాలీ, శ్రీ పాండురంగేయ వసతిం విధాయ భీమాతటే ముక్తిమగాత్సుభక్త్యా, తస్మానంతాభిధానస్యోపాధ్యాయస్య సుతః కృతీ, కాశీనాథాభిధో ధర్మసింధుసారం సమాతనోత్” అని తానే స్వయంగా చెప్పుకొన్నాడు. ఈ గ్రంథకర్తయొక్క పితామహుడు (తాత) కాశీనాథోపాధ్యాయుడని, అతనికి యజ్ఞేశ్వరుడు అనంతభట్టు అని ఇద్దరు పుత్రులని, వీరిలో యజ్ఞేశ్వరుడు జ్యోతిశ్శాస్త్రంలో పండితుడని, ఇక తనకు తండ్రి అయిన అనంతభట్టు సమస్త విద్యాభూషణుడని, వైరాగ్యంచేత జన్మస్థలమైన కొంకణదేశాన్ని విడిచి పాండురంగ క్షేత్రము పండరిపురంలో భీమానదీ తీరమున నివశించి ముక్తిని పొందాడని, ఆయన పుత్రుడనైన తాను (కాశీనాధోపాధ్యాయుడు) ఈ ధర్మసింధుసారము అనే గ్రంథాన్ని చేశానని చెప్పుకొని ఉండటంచేత గొప్ప ధర్మవేత్త అని, బహుగ్రంథ పరిచయవేత్త అని తెలుస్తోంది. ఈ ధర్మసింధును రచించడానికి కాశీనాధోపాధ్యాయుడు మనుస్మృతి మొదలు పురుషార్ధ చింతామణి, కౌస్తుభము, కాలమాధవీయం, ఆపరార్కవ్యాఖ్యానం, రామార్చన చంద్రిక మొదలైన దాదాపు వంద జ్యోతి శ్శాస్త్ర, మీమాంస, న్యాయ, వైశేషిక ధర్మ శాస్త్రాలను పరిశీలించాడు. దీనిలో అక్కడక్కడ ఆయా గ్రంథాలలోని ఉటంకింపులు కనిపిస్తాయి.