NAVARATNA - TRIBASHA DICTIONARY (HINDI ENGLISH TELUGU) - 200 by DR.M.RANGAIAH AND DR.N.V.S.PRASAD book cover

NAVARATNA - TRIBASHA DICTIONARY (HINDI ENGLISH TELUGU) - 200

by DR.M.RANGAIAH AND DR.N.V.S.PRASAD

₹200
Currently out of stock
PublisherNAVARATNA BOOK HOUSE
LanguageTelugu
ISBN9788192068732
ముందుమాట భాష భావ ప్రకటనకు ముఖ్య ఆధారం. మన దేశంలో అనేక భాషలున్నాయి వాటిలో ఇంగ్లీషు అంతర్జాతీయ భాష, హిందీ జాతీయ భాష, తెలుగు తదితర ప్రాంతీయ భాషలు మాతృ భాషలుగా మనకున్నాయి. వీటి తలంభన చేసుకొని, నిత్య జీవితంలో వాడుకలో, విద్యార్జనలో అందిరికీ | అందుబాటులో ఉండేలా ఈ త్రిభాషా డిక్షనరీని మీకు అందిస్తున్నాము. దీని | ప్రత్యేకత దీనిదే పరిశీలించండి. ఆమాట మీరే అంటారు. హిందీ భాషా ప్రాముఖ్యాన్ని, ఆవశ్యకతను గుర్తించి జాతీయభాషగా ప్రకటించడం జరిగింది. నాటినుండి దేశ ప్రజలందరూ హిందీ భాష పట్ల ఆదరాభిమానాలు కలిగి దానిని అభ్యసించడం పట్ల మక్కువ చూపుతున్నారు. నేడు హిందీ భాష కేవలం జాతీయ స్థాయిలోనే కాక అంతర్జాతీయ స్థాయి సరకు పేరు ప్రఖ్యాతులు గడించింది. ఆధునిక విజ్ఞాన యుగంలో మన దేశంలో ఎక్కువ మంది ఆంగ్ల భాషా మాధ్యమంగా విద్యనభ్యసించడం గమనార్హం. మారుతున్న పరిస్థితుల కనుగుణంగా మార్పులు సంతరించుకోవడం సహజమే కదా! పైన పేర్కొన్న అంశాలన్నింటిని దృష్టిలో ఉంచుకొని అన్ని వర్గాల, విద్యార్థుల, పిన్నల, పెద్దలందరి కోసం ఈ డిక్షనరీని రూపొందించడం మేము అడగగానే ఈ డిక్షనరీని తయారుచేసి ఇచ్చిన డా॥ఎమ్. రంగయ్య మరియు డా॥ ఎన్.వి.ఎస్. ప్రసాదు గార్లకు మా హృదయపూర్వక కృతజ్ఞతలు. తప్పులు లేకుండా ఈ పుస్తకాన్ని అందంగా తీర్చిదిద్దిన శ్రీ సూర్య గ్రాఫిక్స్ వారికి మా కృతజ్ఞతలు. ఈ పుస్తకం గురించి తమ విలువైన అభిప్రాయాలను వెలిబుచ్చిన డా॥ వై. వెంకటరమణరావు గారికి మా ధన్యవాదాలు. పబ్లిషర్స్,