NAVAYUGA VAITALIKUDU KANDUKURI by PROF.VELAMALA SIMMANNA Telugu book cover

NAVAYUGA VAITALIKUDU KANDUKURI

by PROF.VELAMALA SIMMANNA

₹150
In stock · 9 available
PublisherPROF.VELAMALA SIMMANNA
LanguageTelugu
1. కందుకూరి సాహితీ జీవితం "నవయుగానికి ఏకైక సృష్టికర్త. ఆంధ్రదేశంలో మొట్టమొదటి ఆధునిక వ్యక్తి. శత్రువులకు సింహ స్వప్నం. అనేక తీవ్రయుద్ధాలలో విజయుడు. అభ్యుదయ విజ్ఞానాలకు వైతాళికుడు. సారస్వతస్రష్టగా, విద్యావేత్తగా, సంఘసంస్కర్తగా, ఎంతమహత్తరవ్యక్తి, మానపుడుగా, అంతకంటే, మహిమాన్వితమనీషి వీరేశలింగం". వార్ల వేంకటేశ్వరరావు హితం చేకూర్చేది సాహిత్యం. హితం ఎవరికి అని అలోచిస్తే సమాజానికి, కాబట్టి సాహిత్యం సమాజానికి హితం కూర్చేదిగా వుండాలి. భారతీయ సాహిత్యం అనాదిగా సమాజ శ్రేయస్సును కోరేదిగా, అందుకు మార్గాలు అన్వేషించేదిగా, వుంది. సాహిత్యం, సమాజం ఈరెండూ అవినాభావ సంబంధం కలవి. సమాజం చాలా విశాలమైంది. విస్తృతమైంది కూడా. సాహిత్యం సామాజిక ప్రతిబింబం. సాహిత్యం సమాజంలోని సంబంధాల్ని విపులంగా వివరిస్తుంది. సమాజంలోని లోపాల్ని ఎత్తి చూపుతుంది. సమాజం ఇలా వుంటే బాగుంటుందని నిర్దేశిస్తుంది సాహిత్యం. సమాజంలోని మార్పులకు సాహిత్యం కూడా ఒక సమిధ అవుతుంది. సాహిత్యం సమాజానికి మార్గదర్శి అవుతుంది. కవి కాగలిగే దాన్ని దర్శిస్తాడు. రానున్న ప్రమాదాన్ని గూర్చి హెచ్చరిస్తాడు కూడా. అంచేతనే కవిని " క్రాంతదర్శి" అని అంటారు. అందుకే కందుకూరి "క్రాంతదర్శి" అయ్యారు. సాహిత్యం, సమాజం ఈ రెండూ సజీవాలు. సజీవపదార్థాలన్నీ తప్పనిసరిగా పరిణామాలకు లోను కావలసిందే. అందులో మార్పు వుండదు. నిర్జీవ పదార్థాలకు పరిణామం వుండదు. పరిణామం చెందనిదానికి ప్రాణం వుండదు. ప్రాణం వున్న ప్రతీ పదార్థం మారుతుంది. ఒక్కొక్కప్పుడు పెనుమార్పులు కూడా చోటుచేసుకుంటాయి. సాహిత్యం, సమాజం అనాది కాలంనుంచి