NAVEENA VISWAROOPA SILPI STEPHEN HAWKING - 70.00 by R.RAMAKRISHNA REDDY Telugu book cover

NAVEENA VISWAROOPA SILPI STEPHEN HAWKING - 70.00

by R.RAMAKRISHNA REDDY

₹70
In stock · 241 available
PublisherVISALAANDHRA PUBLISHING HOUSE
LanguageTelugu
ప్రగతిశీలం కాలం, సంఘర్షణ దాని మూలం. పరిణామం దాని నైజం. ఏమార్పు అందరికీ మోదంకాదు. మార్పు కోరిన నాడు సంఘర్షణ తప్పదు. సంఘర్షణ లేని నాడు కళ, శాస్త్రాలకు ఎదుగుదలలేదు. శాస్త్రం అడుగడుగునా, అణువణువునా, మనిషిజీవన గమనాన్ని, స్వప్రయోజన, సార్వజనీన ప్రయోజనాలతో నిర్దేశిస్తూ, సర్వభూత హితకారిగా, జీవన సార్థక్య దిశగా సాగిపోయే పసిడిబాట వేస్తుంది. శాస్త్రం సదా వందనీయం. శిరోధార్యం. శాస్త్రం చీకట్లో కరదీపిక లాంటిది. శాస్త్రం తీర్చని సమస్యలేదు. శాస్త్రం చెప్పని ధైర్యంలేదు. అది కల్పతరువు. వందల సంవత్సరాలుగా శాస్త్రలోకంలో ఎన్నో ఒడిదుడుకులు. గెలీలియో సూర్యకేంద్ర సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టినరోజుల్లో మత సంబంధిత వాదనలు మొదలయ్యాయి. ఆనాడు మత భావాలకు విరుద్ధంగా సూర్యకేంద్ర సిద్ధాంతాన్ని ప్రబోధించినందుకు గెలీలియోకు కారగార శిక్ష విధించారు. యావత్ వైజ్ఞానిక శాస్త్రానికి గెలీలియో ఆద్యుడు అని ఐన్స్టీన్ కొనియాడారు. ఆల్బర్ట్ ఐన్స్టీన్, మతంలేని శాస్త్రంకుంటుంది. శాస్త్రంలేని మతం గుడ్డిది అని పేర్కొన్నారు. దేవుడు లేదా మతాతీత భావనలను పక్కకు పెట్టి ఆలోచించేవారు కొందరుంటారు. ఆదిశగా వెళ్ళితే, మనిషే ఒక సృష్టికర్త. తన అవసరాల అన్వేషణలో తనకు కావలసిన వస్తువులను తాను సృష్టించుకుంటాడు. యుగాల పాటు మనిషి మేధస్సుని శాసించిన భావాలు, సిద్ధాంతాలు డార్విన్ ప్రతిపాదనతో కుప్ప కూలిపోయాయి. ఈ చరాచరజగత్తుని ఒక సుముహూర్తంలో దేవుడు సృష్టించాడన్న భావన మనిషిని వేల ఏళ్ళు పాలించింది. దానిని కూకటివేళ్ళతో పెకిలించాడు డార్విన్. నేనొక అవిడి వాడినని భావించడం లేదు, భావపరంగా సామాన్య జీవితాన్నే గడుపుతున్నాను. భావాలను మామూలు కంఠంతో వ్యక్తం చేయలేకపోయినా, ఆలోచనలన్నీ మూసలో పోసినట్లు వల్లించగలను (కంప్యూటర్ ద్వారా). విశ్వం స్వయం పూరితం.