NAYANARAGADA NAMASSHIVAYARAGADA by KANDUKURI VENKATA SATYABRAHMACHARYA Telugu book cover

NAYANARAGADA NAMASSHIVAYARAGADA

by KANDUKURI VENKATA SATYABRAHMACHARYA

₹100
In stock · 10 available
PublisherKANDUKURI VENKATA SATYABRAHMACHARYA
LanguageTelugu
చక్రపాణి రంగనాథుడు వీరశైవ కవి. పాల్కుర్కి సోమన సమకాలికుడు. ఆంగ్ల శకం13వ శతాబ్ది వాడు. 'ఈ కవి మొదట వైష్ణవుడు. ఇతడొకసారి శ్రీశైలం మీదుగా అహోబిలం వెళ్తూ మార్గమధ్యంలో ఏ శైవచిహ్నాన్నీ.. శివాలయాన్నీ దర్శించగూడదని గట్టిగా కళ్లుమూసుకుని అహెూబిలం వెళ్లాక కళ్లు తెరిస్తే చూపు లేదు. అప్పుడు నరసింహస్వామి "మల్లికార్జునుడిని దర్శించకపోవడంవల్ల శివాపరాథంతో నీకు గుడ్డితనం వచ్చిందని" చెప్తే.. ఆయన తిరిగి శ్రీశైలం వచ్చి స్వామిని మన్నించమని కోరాడు. ఆ తర్వాత మల్లికార్జునుని దయతో ఒక కంటిచూపు.. పాల్కుర్కి సోమన దయవల్ల మరోకంటికి దృష్టిని పొందాడనే కథ నేటికీ జనపథంలో ఉంది. చక్రపాణి రంగన శివదీక్షను పొందిన తర్వాత అనేక రచనలు చేశాడు. ఆయనకు చూపు వచ్చాక 'నయన రగడ', 'నమశ్శివాయ రగడ'లను రచించాడు. 'నయన రగడ' 342 పదాలు కలిగిన కృతి. దీనికి 'శివభక్తి దీపిక' అనికూడా పేరు ఉంది. 'నమశ్శివాయ రగడ' 108 పదాలతో రచించబడింది. దీనికి 'శివమంత్రవర్ణనము' అనే మరోపేరు. తనకు కంటిచూపు వస్తే తన ఎత్తు కృతులను రచించి మల్లికార్జునస్వామికి సమర్పిస్తానని రంగనాథుడు మొక్కుకున్నట్లు 'రగడ'లో ఉన్నది. ఈ కవి తర్వాతికాలంలో 'వీరభద్ర విజయం', 'శరభలీల', 'శ్రీగిరినాథ విక్రమము', 'దండకము', 'తారావళి', 'శతకము', 'రగడ'లు మొదలైనవి ఎన్నో రచించాడు.