NAYAVANCHANA - 10 SAMVASTARALA NIRANKUSA PALANA - 10 DARUNA MOSALU by PRAJASAKTI PRINTERS&PUBLISHERS PVT.LTD Telugu book cover

NAYAVANCHANA - 10 SAMVASTARALA NIRANKUSA PALANA - 10 DARUNA MOSALU

by PRAJASAKTI PRINTERS&PUBLISHERS PVT.LTD

₹20
In stock · 5 available
PublisherANDHRAPRADESH POURA SANGHALU
LanguageTelugu
మళ్లీ మళ్లీ మనం మోసపోకూడదు మిత్రులారా! దేశంలో ఎక్కడా లేనివిధంగా మన రాష్ట్రంలో ఒక విచిత్ర పరిస్థితి నెలకొంది. మన రాష్ట్రంలో బాహాబాహీగా తలపడుతున్న ప్రధాన కూటములు రెండూ ఆచరణలో బి.జె.పి.కి అక్షరాలా కొమ్ముకాస్తున్నాయి. ప్రజల మీద ఎడాపెడా దాడిచేస్తున్న బి.జె.పి.కి కుడి ఎడమలుగా నిలబడ్డాయి. నిజానికి ఈ ఎన్నికల యుద్ధం వై.ఎస్.ఆర్.సి.పి.కి, టి.డి.పి. - జనసేనకీ మధ్య కాదు. ఆ పార్టీలకూ ప్రజలకూ మధ్య జరిగే యుద్ధం. పదేళ్లుగా ఈ రాష్ట్రాన్ని పాలించిన టి.డి.పి, వై.సి.పి విభజన చట్టం లోని హామీలను అమలు చేయించుకోడానికి కేంద్రంలోని మోడీ ప్రభుత్వాన్ని ఏనాడూ నిలదీయలేదు. మోడీ ప్రభుత్వం రాష్ట్రానికి చేసిన, చేస్తున్న తీవ్ర అన్యాయాన్ని ఏనాడూ నామమాత్రంగానూ ప్రశ్నించలేదు. మోడీ ప్రాపకం కోసమే పోటీపడ్డాయి; పడుతున్నాయి. ఈ పదేళ్లుగా రాష్ట్రానికీ ప్రజలకూ తీరని అన్యాయం జరుగుతూనే ఉంది. ఆ పార్టీలు రాష్ట్రంలో ఒకదాని మీద ఒకటి దుమ్మెత్తిపోసుకుంటూ ప్రజలు తాము బి.జె.పి.తో ప్రత్యక్షంగా, పరోక్షంగా లాలూచీపడుతున్న అసలు వాస్తవాన్ని గమనించకూడదని తెగ తాపత్రయపడుతున్నాయి. ఈ ముసుగు తొలగించకపోతే ఈ ఎన్నికల్లో రాష్ట్రం, ప్రజలు దారుణంగా మరోసారి ఓడిపోతారు. ప్రజల మీద భారాలు, అణచివేత మరింతగా కొనసాగుతూనే ఉంటాయి. భారత ప్రజాస్వామ్యానికి అత్యంత సవాలుగా ఉన్న నయవంచన బి.జె.పి.కి ఈ పార్టీలు కొమ్ముకాస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో బి.జె.పి.నీ దానికి తోడుగా ఉన్న శక్తులనూ ఓడించి, ప్రజల తరపున నికరంగా నిలబడే శక్తులను గెలిపించుకోవాల్సిన బాధ్యత ప్రజల మీద ఉంది. అటువంటి పవిత్ర బాధ్యత వారెందుకు నిర్వర్తించాలో విశదీకరించే పుస్తకం ఇప్పుడు మీ చేతుల్లో ఉంది.