NEE DESAM NEE DYEYAM ANTHIMA LAKSHYAM SOCIALISME by N.SIVARAMIREDDY Telugu book cover

NEE DESAM NEE DYEYAM ANTHIMA LAKSHYAM SOCIALISME

by N.SIVARAMIREDDY

₹100
In stock · 471 available
PublisherN.SIVARAMIREDDY
LanguageTelugu
నీ దేశం నీ ధ్యేయం ప్రాచీన భారతదేశం అద్భుతం, అమోఘం అంటూ ఒక ప్రసిద్ధ చరిత్రకారుడు భారతదేశాన్ని వర్ణించాడు. మన దేశాన్పి ప్రాచీన మేజికల్ ల్యాండ్గా, అందమైన దేశంగా చైనా అధ్యక్షుడు జీ జిన్ పింగ్ మన దేశ పర్యటనకు వచ్చినప్పుడు వర్ణించాడు కూడా. ప్రాచీన చరిత్రగల అన్ని దేశాలకంటే భారతదేశం ముందు వరుసలో వుంటుంది కాబోలు! ప్రముఖ ఆర్కియాలజిస్టు మార్షల్ ఆధ్వర్యాన 1921-22లో త్రవ్వి తీసిన శిథిలాలలను బట్టి సింధూ నదిలోయలో ఐదారువేల ఏండ్ల క్రిందట గొప్ప నాగరికత వున్నట్లు బయటపడింది. సింధూనది దిగువన సింధు రాష్ట్రంలోని లర్థానా జిల్లాలో మొహంజదారో నగరాన్ని కనుగొన్నారు. మొహంజదారో శిథిలాల్లో ఒక అద్భుతమైన సామూహిక ఈత కొలను, సామూహిక డ్రైయినేజ్ వ్యవస్థ నాటి నాగరికత ఉచ్ఛస్థితిని చాటి చెప్తున్నాయి. 56 మిలియన్ కిలోమీటర్లలోని అంగారక ఉపగ్రహానికి ర్యాకెట్ పంపగలుగుతున్నాం గానీ, మన పట్టణాల్లోని డ్రెయినేజి సమస్య మనల్ని ఎక్కిరిస్తోంది. సింధునది లోయలోని పై రెండు నగర శిథిలాలు ప్రస్తుతం పాకిస్థాన్లో వుంటున్నాయి. వైవిధ్యమే భారతదేశపు విశిష్టత చైనా మన దేశంకంటే పెద్దదే కానీ, వివిధ భాషలు, మతాలు, మైనారిటీలు మన దేశంలో వున్నట్లు అక్కడ లేవు. సహనం, సహజీవనం మన దేశానికి ఊపిరి లాంటివి. వేల ఏండ్లనాడు ఇక్కడికి వచ్చి స్థిరపడిన నెగ్రెటోజాలు, ఆస్ట్రలాయిడ్స్, ద్రావిడులు, ఆర్యుల కలయికతో ఒక మిశ్రమ సంస్కృతి రూపు దిద్దుకొంది. ఆర్యులు రాకముందు మన దేశంలోని దక్షిణ ప్రాంతంలోని ద్రావిడులు ఆనాడు దేశమంతటా వ్యాపించి వున్నట్టు చరిత్రకారులు కనుగొన్నారు. స్వతంత్రం రాకముందు మన దేశం అర్థంపర్థం లేని గందరగోళ దేశంగా వుండింది. పదకొండు రాష్ట్రాల్లో బ్రిటిషు పాలన, తతిమ్మా మూడింట ఒక భాగంలో ఐదారు వందల సంస్థానాలు వుండేవి. నేడు ఒక అర్థవంతమైన భాషా ప్రయుక్త రాష్ట్రాలుగా దేశం రూపు దిద్దుకొంటూ 29 రాష్ట్రాలు, 7 కేంద్ర పాలిత ప్రాంతాలు, రాజ్యాంగం గుర్తించిన 22 భాషలతోటి ఒక పాలిటీగా ఏర్పడింది. ఇది అత్యంత స్వాగతించదగిన పరిణామం