NEELAVENI by P.V.SUNIL KUMAR Telugu book cover

NEELAVENI

by P.V.SUNIL KUMAR

₹100
In stock · 23 available
PublisherVISALAANDHRA PUBLISHING HOUSE
LanguageTelugu
పి.వి. సునీల్ కుమార్ పశ్చిమగోదావరి జిల్లావాసి. చింతలపూడిలో పుట్టారు. పెనుగొండలో పెరిగారు. తణుకు, విశాఖపట్నం, హైదరాబాదులలో విద్యాభ్యాసం గడిచింది. మాతామహులు ఆంగ్లభాషా పండితులు, ప్రధానోపాధ్యాయులు. షేక్స్పియర్ రచనలని వారే రచయితకు బాల్యంలో పరిచయం చేశారు. తల్లిగారు దయామణి. శరత్, చలం సాహిత్యాల అభిమాని. అలా ఆంగ్ల, ఆంధ్ర సాహిత్యాల పట్ల అభిరుచి ఏర్పడింది. ప్రవృత్తిరీత్యా పాఠకుడు, రచయిత అయిన సునీల్ కుమార్ వృత్తిరీత్యా ఐ.పి.యస్. అధికారి. ఫ్యాక్షన్ ప్రాంతమైన కడప జిల్లాలో తన కెరీర్ ప్రారంభించారు. వీరు ఉన్నంత కాలం కడపలో ఒక్క ఫ్యాక్షన్ నేరం కానీ, ఎన్నికలలో రీపోల్ కానీ లేవు. సంస్కరణలకు, ప్రజాహిత పోలీసింగ్ లో అనేక ఆవిష్కారాలకు వీరు చిరునామా. యాబై కథలు; ప్రారంభం, సయ్యాట, క్షుద్ర అనే మూడు నవలలు వీరి కలం నుంచి వచ్చాయి. తెలుగు సాహిత్యానికి సునీల్ కుమార్ చేసిన సేవలను గుర్తించి ఢిల్లీ తెలుగు అకాడమీ 'రాష్ట్రీయ వికాస్ శిరోమణి' అవార్డు (2014) అందజేసి గౌరవించగా, తానా సంస్థ 2015 సం॥ జూలై 11న వాషింగ్టన్ డి.సి.లో సత్కరించింది. కథన కుతూహలం అవును ఇది కథన కుతూహలమే. పి.వి.సునీల్ కుమార్ కథల్లో తొంగి చూసేది, పొంగి పొరలేదీ సామాజిక అన్యాయంపై కదన కుతూహలం. ప్రేమరాహిత్యం నుండి సామాజిక న్యాయం వరకూ, పోలీసు నుండి పొలిటీషియన్ వరకూ ఏ అంశం ఆయన కలం స్పృశించినా పాఠకుడికి వ్యంగ్యపు పంట పండినట్టే. అంతర్జాతీయ సాహిత్యంలోనే అరుదూ, తెలుగు సాహిత్యంలో అయితే అసలు ఊసేలేకుండా పోయిన సెటైర్ (వ్యంగ్యం) సునీల్ కుమార్ కలం నుండి తీయటి గోదావరి ధారలాగా పరవళ్ళు తొక్కుతోంది ఈ కథా సంపుటిలో. 'దెయ్యాలు' ప్రేమను పంచినా, 'డిసిప్లీ'లు సామాన్యుడి కోసం మొరిగినా అన్నీ సునీల్ కుమార్ మార్కు పంచ్ లోనే. 'థూ' అన్నా, 'చీకటి' కన్నా, 'పరిశుద్ధంగా' వివాహాన్ని 'దేవదాసు' జరిపించినా ధిక్కార స్వరమే కానీ, మరీముఖ్యంగా వినోదాలు జల్లు. ఈ కథల్లో జీవం ఉంది, జీవితం ఉంది... రంగుల హరివిల్లులా నవ్వులు పూయించగల హాస్య-వ్యంగ్య వైభవం ఉంది. అక్షరాలా ఇది అనితరసాధ్యం... అందుకోండి అక్షర తూణీర వ్యంగ్య నీరాజనం. Phone: 9440717171 విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్ చంద్రం బిల్డింగ్స్, చుట్టుగుంట, విజయవాడ - 520 004