NEERE JEEVANADHARAM by DR.AALLA APPARAO Telugu book cover

NEERE JEEVANADHARAM

by DR.AALLA APPARAO

₹70
In stock · 258 available
PublisherVISALAANDHRA PUBLISHING HOUSE
LanguageTelugu
డా|| ఆళ్ళ అప్పారావు డాక్టర్ ఆళ్ళ అప్పారావు గత 30 సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సాంకేతిక విద్యాశాఖలో రసాయన శాస్త్ర అధ్యాపకునిగా పనిచేసి ఇటీవలే పదవీ విరమణ పొందారు. బహుగ్రంథ రచయిత అయిన వీరు రసాయనిక, విద్య, విజ్ఞానశాస్త్రం మరియు సామాజిక శాస్త్రాలకు సంబంధించిన ఎన్నో రచనలు చేసారు. వీరు మంచి అనువాదకులు కూడా. ఎన్నో కథలు, మినీ కవితలు, పలు విజ్ఞానశాస్త్ర వ్యాసాలు ప్రముఖ పత్రికలలో ప్రచురించబడినాయి. “విశాఖజిల్లాలో గ్రామీణ, గిరిజన, పట్టణ ప్రాంతాలలో గల వివిధ యాజమాన్యాల ఆధ్వర్యంలో నడపబడుతున్న ఉన్నత పాఠశాల విద్యార్థులలో గల అభ్యసన వైకల్యాలను గుర్తించుట వాటిని సరిదిద్దే పరిష్కారమార్గములు” అనే పరిశోధనాంశంపై ఆంధ్రవిశ్వకళాపరిషత్తు వారు, వీరికి 'ఎడ్యుకేషన్' విభాగములో ఇటీవలే పి.హెచ్.డి ని ప్రధానం చేశారు. రసాయన శాస్త్రమునకు సంబంధించి పాలిటెక్నిక్ డిప్లమా విద్యార్థులకు అప్లయిడ్ సైన్సు, పాలిటెక్నిక్ కెమిస్ట్రీ, లేబరేటరీ మాన్యువల్ వంటి గ్రంథాలను రచించారు. అంతర్జాతీయ స్థాయిలో కూడ రసాయన శాస్త్రమునకు సంబంధించి 'కెమిస్ట్రీ ఆఫ్ వాటర్' అనే ఉద్గ్రంథమును రచించారు. ఇది బహుళ ప్రజాదరణ పొందడం విశేషము. ఇవిగాక 'పర్యావరణ విజ్ఞాన శాస్త్రము'నకు సంబంధించి అనేక చిన్న, పెద్ద గ్రంథాలను రచించారు. 'పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయము' వారు వీరి రచన 'పర్యావరణ పరిజ్ఞానం'ను 2001లో పుస్తకంగా ప్రచురించింది. 'ఎడ్యుకేషన్'కు సంబంధించి అభ్యసనవైకల్యాలు, విద్య నిఘంటువు, విద్య-ఆధారాలు, అధ్యాపనం అభ్యసనం - అధ్యయనం మరియు మంద అభ్యసనంపై వివిధ గ్రంథాలను రచించారు. ఆధ్యాత్మిక విషయానికి సంబంధించి 'శ్రీ లక్ష్మిసన్నిధి' అనే గ్రంథాన్ని కూడ సంకలనంగావించారు. 1997లో 'స్వాతంత్ర్య స్వర్ణోత్సవాలు' సందర్భంగా వ్యాసరచన, గ్రంథరచన సంబంధిత అంశాలలో నిర్వహించిన 'జన్మభూమి' పోటీలలో స్వర్ణ, కాంస్య పతకాలు ప్రశంసా పత్రంను అప్పటి ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబునాయుడుగారి నుండి అందుకున్నారు. 2000 సం||లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము 'స్టేట్ బెస్ట్ పాలిటెక్నిక్ లెక్బరర్' అవార్డునిచ్చి సత్కరించింది. వీరు 'నేషనల్ బుక్స్ట్ ఇండియా' వారి అనువాదక ప్యానల్ సభ్యుడు కూడ. ధ్ర పబ్లిషింగ్ విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్ చంద్రం బిల్డింగ్స్, చుట్టుగుంట, విజయవాడ - 520 004.