
NEETHI KATHALU - SASEMIRA
by BHAMIDIPATI BALATRIPURASUNDARI
₹50
In stock · 9 available
PublisherSHANMUKESWARA PRACHURANALU
LanguageTelugu
చిరకారి కథ ఒక ఊళ్ళో 'మేధానిధి' తన భార్యా పిల్లలతో నివసిస్తున్నాడు. అతడి పెద్ద కొడుకు పేరు 'చిరకారి'. ఎవరు ఏ పని చెప్పినా బాగా ఆలోచించాకే చేసేవాడు. అందుకె అతడికి ఆ పేరు పెట్టాడు తండ్రి. ఒకరోజు మేధానిథికి భార్య మీద చాలా కోపం వచ్చింది. అంతకు ముందు కూడా కోపం వచ్చేది కానీ, తిట్టి వదిలేసేవాడు. ఇప్పుడు అలా కాదు. కోపాన్ని అదుపు చేసుకోలేకపోయాడు. "చిరకారీ!" గట్టిగా పిలిచాడు. అలవాటు ప్రకారం ఆలోచనలో ఉన్న చిరకారికి వినిపించలేదు. "ఏరా! పిలుస్తుంటే వినబడ్డంలేదా? పిలవగానే వచ్చే అలవాటు లేదు నీకు. ఎన్నిసార్లు పిలవాలి? ఇలారా!" కోపంగా అరిచాడు మేధానిథి. చిరకారి పరుగెత్తుకుంటూ వచ్చి "చెప్పండి నాన్నగారూ!" అన్నాడు కంగారుగాను, భయంగాను. "మీ అమ్మని నరికి పారెయ్యి!" ఆజ్ఞాపించి అక్కడ నుంచి వడివడిగా వెళ్ళిపోయాడు మేధానిథి. తను విన్నది నిజమో... కాదో అనుకుని నిలబడి తండ్రి వెళ్లిన వైపు చూస్తున్నాడు చిరకారి. మళ్లీ మేధానిథి వెనక్కి వచ్చి "నేను చెప్పింది వినబడలేదా? వెంటనే మీ అమ్మని నరికి పారెయ్యి!" అన్నాడు కోపంగా. “అలాగే నాన్నగారూ!" అంటూ అక్కడినుంచి బయటకు వచ్చేశాడు అయోమయంగా. అతడికి ఏం చెయ్యాలో తోచలేదు. నాన్నగారికి అమ్మ మీద కోపం వచ్చింది. చాలా కోపమే వచ్చింది. అయితే మాత్రం అమ్మని చంపెయ్యాలా? కోపం వచ్చింది ఆయనకి కదా.. ఆయన చంపుకోవాలి కాని, నేను చంపడమేమిటి? అందులోనూ అమ్మని!! తల్లి దైవంతో సమానమని ఆయనే కదా చెప్పారు. మరిప్పుడు నరికెయ్యమని కూడా ఆయనే చెప్తున్నారు. ఏమిటో... ఏమీ అర్ధం కాకుండా ఉంది. తల్లిని చంపడం మహాపాపం. అలాగే తండ్రి ఆజ్ఞప్రకారం నడుచుకోకపోవడం కూడ తప్పే! ఈ పెద్దవాళ్ళు చెప్పింది ఆచరించాలో.. లేదో తెలియదు. నిజంగానే అమ్మని నరికెయ్యమన్నారా.. నాకు అలా వినిపించిందా... ఆలోచిస్తూ అర్ధం కాని స్థితిలో రోజంతా గడిపాడు చిరకారి. రాత్రి కూడా గడిచిపోయింది.