
NEEVU - NEEPUTTUKA
by V.R.SASTRY
₹20
In stock · 268 available
PublisherVISALAANDHRA PUBLISHING HOUSE
LanguageTelugu
తొలిపలుకు విశాలాంధ్ర ప్రచురణాలయం విజ్ఞానాభివృద్ధి కుపయోగపడే శాస్త్రీయ గ్రంథాలను ప్రకటింప నిశ్చయించింది. ముఖ్యంగా బాలబాలికల విజ్ఞానాభివృద్ధి కుపయోగపడే గ్రంథాలు తెలుగులో చాలాపరిమితంగా మాత్రమే వున్నాయి. ఈ లోటు తీర్చడానికి మేము తీవ్రంగా కృషి చేస్తున్నాం. దీనికి ఆంధ్ర దేశంలోని మేధావులు, సైంటిస్టులు తమ పూర్తి సహకారాన్నిస్తారని ఆశించుతున్నాం. ఈ పుస్తకంలో శ్రీ వి. ఆర్. శాస్త్రిగారు మాతృగర్భంలో పిండం ఎలా అభివృద్ధి చెందుతుందో సుబోధకంగా రాశారు. పిల్లల నుద్దేశించి పిల్లలకు తెలిసే భాషలో రాశారు. మాతృగర్భంలో ప్రవేశించింది మొదలు జీవాణువు క్రమక్రమంగా ఎలా పరిణామం చెంది శిశువుగా జనించుతుందో తెలిపారు. చక్కని వుదాహరణలిచ్చి ఒక్కొక్క దశలో పిండం పురుగువలె, చేపవలె, జంతువువలె, కోతివలె వుండి చివరకు మానవాకారం ఎట్లు దాల్చిందో చూపారు. ఈ పుస్తకాన్ని ఇదివరకు ప్రజాశక్తి ప్రచురణాలయం రెండుసార్లు ముద్రించినప్పటికీ ప్రతులయిపోయాయి. పాఠకుల కోరికపై దీన్ని పునర్ముద్రిస్తున్నాం. ఇదే ఈ పుస్తకపు ప్రాశస్త్యాన్ని చాటుతుంది. ముందు ముందు గూడా శ్రీ శాస్త్రిగారు పిల్లల కుపయోగపడే గ్రంథాలను రాయాలని కోరుతున్నాం. 1957 - సంపాదకవర్గం.