
NEGADU NAAGARIKATHALU
₹130
In stock · 57 available
PublisherVISALAANDHRA PUBLISHING HOUSE
LanguageTelugu
Negadu by Borra Govardhan వానరం నరవానరంగా, నరవానరం నరునిగా మారడం ఏదో ఒక వారం పదిరోజుల్లో జరిగింది కాదు. లక్షల సంవత్సరాల మహా సంగ్రామం అది. మానవ జాతులు సంఘర్షిస్తూ సాధించుకున్న నాగరికత కూడా అంతే! ప్రకృతిపై పోరాటం, క్రూర జంతువులతో కుమ్ములాట, మనిషి మనిషితో యుద్ధం, కనికరం ఎరుగని కఠోర జీవనం, కర్కశంగా కబళించాలని చూసే కాలం... ఇన్ని అవరోధాలపై అలుపెరుగని యుద్ధం చేసి ఆదిమ మానవులు సాధించిన విజయమే నాగరికత. ఎన్ని తెగల తలలు తెగిపడితే, ఎందరి రక్తం ఏరులా పారి ఈ నేల నానితే ఈ నాగరిక జీవనం మనకు దక్కిందో! 50 లక్షల ఏళ్ళ సుదీర్ఘ మానవ జాతుల మహోన్నత పోరాటాల్ని, నాగరికతను మలుపుతిప్పిన మహా యుద్ధాల్ని, హాలీవుడ్ చిత్రంలా మీ కళ్ళముందుంచే పదిమంది మహాయోధుల కదనజీవితాల్ని తెలుపుతూ... తెలుగులో వచ్చిన మొట్టమొదటి పుస్తకం ఇది! విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్ చంద్రం బిల్డింగ్స్, చుట్టుగుంట, విజయవాడ-520 004