NEMALI KANNODA by SUDDALA ASHOKATEJA Telugu book cover

NEMALI KANNODA

by SUDDALA ASHOKATEJA

₹100
In stock · 215 available
PublisherVISALAANDHRA PUBLISHING HOUSE
LanguageTelugu
శుభాభివందనం శ్రీ ఎస్.వి. రామారావు సినీ విజ్ఞానవిశారద, హైదరాబాదు తెలుగుభాష, దాని సౌందర్యం ఇరవయ్యో శతాబ్దంలో సామాన్య ప్రజలకు చేరువయ్యింది సినిమా సాహిత్యం ద్వారానే అనేది నిర్వివాదాంశం. ఆఁ, సినిమా పాటలే కదా అని చులకనభావంతో పెదవి విరిచే భాషా పండితులకు 'మల్లీశ్వరి' సాహిత్యంతో కనువిప్పు కలిగింది. తాపీ ధర్మారావు వంటి పండిత ప్రకాండులు 'మల్లీశ్వరి' గీతాలతో సినీ సాహిత్యానికి కావ్య గౌరవం దక్కిందని ప్రశంసించారు. నాటి సీనియర్ సముద్రాల నుంచి ఈనాటి కవులకు వరకూ దాదాపు మూడు వందల మంది సినీకవులు సాహిత్యసృష్టి చేశారు. తెలుగుటాకీ తొలి అర్ధశతాబ్దంలో (1931-1980) వచ్చిన గీతాల్లో సాహిత్యం స్పష్టంగా వినిపించేది. కాలగమనంలో అన్నిరంగాల్లోనూ వచ్చిన వేగంతోబాటు సినిమా రూపకల్పనలోనూ యెన్నో మార్పులు సంభవించాయి. గత రెండు పుష్కరాలుగా సంగీత రంగంలో బీట్ ప్రాధాన్యత పెరిగినా అవకాశమున్న మేరకు సన్నివేశానికి, పాత్రల ఔచిత్యానికి తగ్గ గీతాలు వ్రాస్తున్న వారిలో ప్రథమ పంక్తీయులు జాతీయ పురస్కార గ్రహీత సుద్దాల అశోక్ తేజ. మూడువందలకు పైగా సినీగీత రచయితలు అరవై వేలపైగా గీతాలు వ్రాసారు. వాటిలో పుస్తకాల రూపంలో లభ్యమయ్యేవి మూడు నాలుగు వేలలోపే. అవి సముద్రాల, శ్రీశ్రీ, ఆరుద్ర, ఆత్రేయ, కొసరాజు, వేటూరి, సిరివెన్నెల, మల్లెమాల వంటివారు వ్రాసిన గీతాల్లో కొన్ని మాత్రమే |గంథ రూపాన్ని సంతరించుకున్నాయి. వాటిలో కూడా కొన్ని సందర్భాల్లోని పాటలు మాత్రమే వున్నాయి తప్ప నిర్మాత, సంగీత దర్శకులు, గాయనీ గాయకుల వివరాలు లేవు. గతంలో అశోక్ తేజ 'ఆకుపచ్చ చందమామ' పేరుతో వారు వ్రాసిన సినీ గీతాల సంకలనాన్ని వెలువరించారు. అందులో కూడా పాట తప్ప ఇతర వివరాలు లేవు. వాటి ఆవశ్యకతను గురించి వారికి నేను వివరించాను. వారు తాజాగా రూపొందించిన సినీగీతాల సంకలనం "నెమలికన్నోడ"లో వీలయినన్ని ఎక్కువ వివరాలు అందించటం అభినందనీయం. ఇది పరిశోధకులకు ఎంతో ఉపకరిస్తుంది.