
NEMALINAARA
by B.MURALIDHAR
₹200
In stock · 11 available
PublisherDEVINENI SEETHARAVAMMA FOUNDATION
LanguageTelugu
నా సాహితీ నేపథ్యం నేను రాసిన కథల నేపథ్యాల గురించి చెప్పుకునే ముందు, నా సాహితీ నేపథ్యం గురించి కూడా కొంత చెప్పుకోవాలి. కాలేజీ చదువు కోసం వూళ్లోంచి, జిల్లా కేంద్రానికి వచ్చిన తర్వాత, ఆనాటి అత్యుత్తమ తెలుగు ఉపన్యాసకుల పాఠాలను వినడం- జిల్లా కేంద్ర గ్రంథాలయంలో అనేక దిన, వార, మాసపత్రికలు-తెలుగు, ఇంగ్లీషు, హిందీ భాషలవి అందుబాటులో ఉండటం, వాటిని చదవడం వలన నా అవగాహనా విస్తృతి పెరిగింది. కేవలం విపరీతంగా చదవడం వలన ఎంత అవగాహన వచ్చినా భాష మీద ఎంత పట్టు ఉన్నా, ఒక కవితనో, కథనో స్వయంగా సృష్టించాలంటే సృజనాత్మకత అవసరం. ఈ సృజనాత్మకత పుట్టుకతో వచ్చేదే తప్ప- ఎవరో నేర్పించినంత మాత్రాన, ఎవరినో విన్నంత మాత్రాన వచ్చేదికాదని నాకు స్పష్టమయింది. అది కేవలం వ్యక్తిగత ప్రతిభనే, కాకపోతే నాలాంటివాడికి భాష మీద పెట్టు పట్టు లేకపోయినా, సాహితీ వాతావరణమూ పెద్దగా లేకపోయినా సాహిత్యం వైపు దృష్టి మరలడం అన్నది నా జీవితంలో ఒక మంచి మలుపు. బి.ఎస్సీ మూడవ సంవత్సరం చదువుతున్నప్పుడు కాలేజీ స్థాయి వ్యాసరచన పోటీలో నెగ్గి, మొదటి ప్రపంచ తెలుగు మహాసభలకు 1975లో, కళాశాల ప్రతినిధిగా హాజరయి నపుడు కలిగిన అపారమైన అనుభవాలు, అనుభూతుల ఫలితంగా తెలుగుభాష గురించీ, తెలుగు సాహిత్యం గురించీ మరింత అవగాహనా, ఆసక్తీ ఏర్పడినాయి. చిన్న చిన్న కవితలు వ్రాస్తూ, పత్రికలకు పంపిస్తూ, అవి అచ్చులో చూసుకొని ముఖ్యంగా కవిత కింద నా పేరు చూసుకొని మురిసిపోవడం వరకు కొంతకాలం నడిచింది. ఆనాటి మేటి సాహిత్య మాసపత్రిక 'భారతి'లో 1980-82లలో నావి నాలుగు కవితలు ప్రచురింప బడటంతో కొంత సీరియస్ నెస్ వచ్చింది.