NEMARESINA MEMORIES by MULLAPUDI SRIDEVI Telugu book cover

NEMARESINA MEMORIES

by MULLAPUDI SRIDEVI

₹100
In stock · 5 available
PublisherMULLAPUDI SRIDEVI
LanguageTelugu
1963లో ఆంధ్రజ్యోతి సచిత్రవారపత్రిక వీకెండ్ వి.వి. రామమూర్తి గారు ప్రారంభించిన ‘జ్యోతి’ మాస పత్రిక సంపాదకవర్గంలో రామమోహనరావు గారు, రమణగారు, బాపుగారు, రావికొండలరావు గారు, వి.వి.కె. రంగారావు గారు చేరారు. వీరిలో రామమూర్తి గారు, రామమోహనరావు మాత్రం విజయవాడలో ఉండిపోయారు. మిగిలిన వాళ్లందరూ మద్రాసులోనే. అప్పట్లో బాపు విజయవాడలో ఉండేవాడు. నేనూ రెండు మూడు ఏళ్లూ ‘జ్యోతి’కి చాలా రకాల పనులు చేశాను. సరిగ్గా ఆ కాలంలోనే – 1963 సెప్టెంబరులో – మా నాన్నగారు శ్రీదేవికి ఎప్పుడూ మంచి సంబంధం చూడమని నాకు ఉత్తరం రాశారు. శ్రీదేవికి మంచి ఫోటో తీయించి పంపమని నేను రాశాను. నాన్నగారు శ్రీదేవిని గుడివాడ తీసుకెళ్లి అక్కడ ఒక ఫోటో స్టూడియోలో ఫోటో తీయించి నాకు పంపించాడు. ఒకసారి నేను యథాలాపంగా బాపుగారిని అడిగాను – ఏమైనా సంబంధం ఉంటే చూడమని. శ్రీదేవి ఫోటో కూడా చూపించాను. వెంటనే ఆయనకి “ఈ అమ్మాయి రమణకి తగినది” అనిపించింది. ఆ మాటే నిజం అయ్యింది