
NENU BARUVU TAGGAGALANU
₹30
In stock · 1 available
PublisherOM PUBLICATIONS
LanguageTelugu
మీరు బరువు తగ్గగలరు... మానవాళి నేడు సతమతమవుతున్న సమస్యలలో 'స్థూలకాయం' కూడా ప్రముఖంగా చెప్పుకోవాలి. ఊబకాయాన్ని తగ్గించుకుని స్లిమ్గా తయారవడానికి జనం ఎన్నో పాట్లు పడుతున్నారు. ఒబెసిటీని తగ్గిస్తామని అంటూ ఎన్నో స్లిమ్ సెంటర్లు వారి ప్రకటనలతో హోరెత్తిస్తున్నాయి. వీరి ఆకర్షణీయమైన ప్రకటనలకు ప్రభావితమై జనం ఒబెసిటి సెంటర్ను ఆశ్రయిస్తున్నారు. నిజానికి ప్రమాణాలు పాటించని కేంద్రాలలో చేరడం వలన స్థూలకాయం తగ్గకపోగా ఇతర అనేక రకాలైన అనారోగ్యాల బారిన పడుతున్నారు. 'ఒబెసిటి' రావడానికి 'వోవర్ ఈటింగ్' ఒక్కటే కారణమనుకుంటారు. ఇందులో కొంత వరకు నిజం ఉన్నా స్థూలకాయానికి దారితీసే ఇతర కారణాలు గురించి కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. వంశపారంపర్యంగా స్థూలకాయం రావచ్చు. అనారోగ్యం, థైరాయిడ్ గ్రంథి పని తీరులో లోపం ఏర్పడటం, శారీరక వ్యాయామం చేయపోవడం ఇవన్నీ ఊబకాయానికి దారితీస్తాయి. స్థూలకాయం మనిషిలో ఒత్తిడి, ఆందోళనలు పెంచుతుంది. వ్యాకులతకు గురి చేస్తుంది. జీవన ప్రమాణం తగ్గిస్తుంది. అధిక రక్తపోటు, ఆర్థరైటిస్, స్థూలకాయం వంటి వ్యాధులు నిద్రలేస్తాయి. మనిషి మానసికంగా కృంగిపోతాడు. అతని ఆత్మవిశ్వాసం దెబ్బ తింటుంది. కాబట్టి ఒబెసిటీతో బాధపడేవారు. తప్పనిసరిగా బరువు తగ్గాలి. ఈ బరువు తగ్గడం అనేది ఓ పద్ధతి ప్రకారం జరగాలి. మరి ఆ పద్ధతులేమిటన్నది ముందు పేజీలలో మీరే తెలుసుకుంటారు. మరి మీరు బరువు తగ్గడానికి సిద్ధమేనా?