NENU KALISINA MUKHYAMANTRULU MANAVAVADULU by D.JANAKIRAM GARU Telugu book cover

NENU KALISINA MUKHYAMANTRULU MANAVAVADULU

by D.JANAKIRAM GARU

₹75
In stock · 15 available
PublisherNARISETTI INNAIAH
LanguageTelugu
ముఖ్యమంత్రులతో నా పరిచయం ఆంధ్ర ఏర్పడినప్పటినుండి, తొలి భాషా రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ రూపొందిన తరువాత రాష్ట్ర రాజకీయాలలో ముఖ్యమంత్రి చాలా కీలకమైన స్థానాన్ని ఆక్రమించటం స్పష్టంగా కనిపిస్తున్నది. పైకి అధికార వికేంద్రీకరణ, ప్రజలకు పెత్తనం అని నినాదాలిచ్చినా, చట్టాలు చేసినా అవేవీ అమలులోకి రాలేదు. రాష్ట్రంలో అధికారం అంతా ముఖ్యమంత్రి చుట్టూ ప్రదక్షిణ చేస్తుండగా, కాంగ్రెస్ రాజకీయాలలో ముఖ్యమంత్రులు కేంద్ర నాయకత్వం చెప్పుచేతల్లో ఉంటున్నారు. అంత ప్రాధాన్యత సంతరించు కున్న ముఖ్యమంత్రుల గురించి వారితో గల కించిత్ పరిచయాల విషయాన్ని ప్రస్తావించటానికే ఈ రచన సాగింది. కొందరితో పైపైన, మరికొందరితో సుదీర్ఘంగా, ఇంకొందరితో సన్నిహితంగా ఈ పరిచయాలు ఏర్పడ్డాయి. అయితే రాజకీయ పార్టీలతో, ముఠా రాజకీయాలతో సంబంధంలేని ఈ పరిచయాలను తెలియచేయటమే ఈ రచన ఉద్దేశ్యం. ఇందులో వ్యక్తిత్వాలను, సంఘటనలను, ఆసక్తికర విషయాలను చెప్పే తీరు ఉంటుంది. ఇది ఉమ్మడి మద్రాసు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న రాజాజీ, కురువృద్ధులు టంగుటూరి ప్రకాశంతో ప్రారంభమై కొణిజేటి రోశయ్యతో ఆగిపోతుంది. సాధ్యమైనంత వరకూ పరిశీలన రాగద్వేషాతీతంగా చేయడం ప్రధానోద్దేశ్యం. - ఇన్నయ్య