NENU NADICHINA BATA by NALLURI VENKATESWARLU Telugu book cover

NENU NADICHINA BATA

by NALLURI VENKATESWARLU

₹200
In stock · 438 available
PublisherVISALAANDHRA PUBLISHING HOUSE
LanguageTelugu
ISBN9789391400545
Nenu Nadichina Baata by Nalluri Venkateswarlu ప్రస్తుతం నా జీవితం 6-6-2021 తేదీ నుండి 86 సంవత్సరంలో నడుస్తోంది. నా జీవితంలో మా కుటుంబానికి నేను కూడబెట్టిన ఆస్తులేమీ లేవు. పూర్వీకులు సంపాయించిన ఆస్తులను ఖర్చుపెట్టుకొనటమే జరిగింది. నా ఇద్దరు కొడుకులూ స్వయంకృషితోనే స్థిరపడ్డారు. 60 సంవత్సరాలు నాతో సహజీవనం చేసిన నా భార్య అనారోగ్యంతో ఇటీవలే కన్నుమూసింది. నాకు స్థిరాస్తులేమీ లేవు. నాకు మూడవ కొడుకుగా పెరిగిన వందేమాతరం శ్రీనివాస్, ఒక ఫ్లాటు ఒంగోలులో కొని నా పేరున పెట్టాడు. నివసించటానికి అది మాత్రం వుంది. స్వగ్రామంలో పూర్వీకులు కట్టిన ఇల్లూ, విశాల ప్రాంగణం... పూర్వీకులను గుర్తుచేస్తూ చివరి దశలో వుంది. అయితే... వెలలేని గొప్ప ఆస్తి నాకొకటుంది.... వివిధ రంగాలలో స్థిరపడిన ఎందరో ఆత్మీయులు... సోదరతుల్యులు... అనేకమంది కామ్రేడ్స్. వారందరి అభిమానమే నాకు కొండంత ఆస్తి. ప్రస్తుతం నాకు బాధ్యతలంటూ ఏమీ లేవు. పార్టీ రాష్ట్ర సమితి సమావేశాలకు ఆహ్వానితుణ్ణి. ఒంగోలులో పార్టీ ఆఫీస్కెళ్తూ ఉంటాను. ఆసరా కేంద్రం పర్యవేక్షణలో... నగరంలో జరిగే వివిధ కార్యక్రమాలలో... తరచుగా పాల్గొంటూ జీవితం సాగిస్తున్నాను. కన్నుమూసేంత వరకు పార్టీకి శక్తిమేరకు తోడ్పడాలనేదే... నా కోర్కె.. విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్ చంద్రం బిల్డింగ్స్, చుట్టుగుంట, విజయవాడ-520 004 ISB No. 978-93-91400-54-5