
NERA SAMBANDITHA NYAYA CHATTAM 2013
₹50
In stock · 1 available
PublisherASIA LAW HOUSE
LanguageTelugu
నేర సంబంధ న్యాయ (సవరణ) చట్టం, 2013' (నిర్భయ చట్టం, 2013) సవరణ (2013 135 , 3-2-2013 భారతీయ శిక్షాస్మృతి, నేర శిక్షా విధానం 1973, భారతీయ సాక్ష్యాధార చట్టం, 1872, లైంగిక అపరాధాల నుంచి బాలబాలికల సంరక్షణ చట్టం 2012లకు సవరణలు చేకూర్చిన చట్టం. ...26 భారతదేశ గణతంత్ర వ్యవస్థలో 64వ సంవత్సరాన పార్లమెంట్ ద్వారా చట్టంగా ఆదేశించబడింది. అధ్యాయం - 1 ప్రాథమికం 1. లఘునామం, ఆరంభం :- (1) ఈ చట్టాన్ని నేర సంబంధ న్యాయ (సవరణ) చట్టం, 2013గా వ్యవహరిస్తారు. (2) 3వ ఫిబ్రవరి 2013 నుంచీ ఈ చట్టం అమలులోకి వస్తోంది. అధ్యాయం - 2 భారతీయ శిక్షాస్మృతికి సవరణలు 2. సెక్షన్ 100కు సవరణ :- భారతీయ శిక్షాస్మృతి (1860 నాటి 45వ చట్టం) (ఇక ముందు ఈ అధ్యాయంలో శిక్షాస్మృతిగా వ్యవహరించడం జరుగుతుంది) లో సెక్షన్ 100లో 6వ క్లాజ్ తరువాత దిగువ క్లాజ్ను జోడించడం జరిగింది. “ఏడవది, - ఆమ్లాన్ని విసరడం లేదా వ్యవహరించడం లేదా విసిరే యత్నం, వ్యవహరించే యత్నం, దాని ద్వారా తీవ్రంగా గాయపరిచే యత్నం, సదరు యత్నం ఫలితంగా గాయపరచడం". 3. సెక్షన్ 1662, 166బిలుగా కొత్త సెక్షన్ల జోడింపు :- శిక్షాస్మృతిలో 166వ సెక్షన్ తరువాత దిగువ సెక్షన్లను జోడించడమైంది.