
NGO LA KATHA - 15
₹15
In stock · 4 available
PublisherPERSPECTIVES
LanguageTelugu
ఎన్జీవోల కార్యకలాపాలు పౌరసమాజంలో వామపక్ష రాజకీయాల సామాజిక పునాదులను చాపకింద నీరులా తొలిచేస్తున్నాయి. రాష్ట్రంలో తలెత్తిన ఏ పరిణామాన్నీ మేథావులు, రాజకీయ విమర్శకులు, సాహిత్యకారులు వదల్లేదు. కానీ ఎన్జీవోల పరిణామం మాత్రం ఏ అధ్యయనానికీ, విశ్లేషణకూ, విమర్శకూ నోచుకోలేదు. ఎక్కడ ప్రజా ఉద్యమాలు తలెత్తితే, ఎక్కడ ప్రపంచబ్యాంకు సంస్కరణలు ప్రవేశపెడితే అక్కడ ఇవి ఉంటాయి. ఉద్యమాలను నీరు కారుస్తాయి. మార్కెట్కు పట్టం కడతాయి. మూడవ ప్రపంచదేశాల ప్రజలను ఇవి మనసా వాచా కర్మణా ప్రపంచీకరణలో భాగం చేస్తాయి. ఎన్జీవోలదీ సామ్రాజ్య వాదానిదీ ఒకే చరిత్ర. మన సమాజ వలసీకరణ చరిత్రే ఎన్జీవోల చరిత్ర. పాశ్చాత్య ప్రభుత్వాలకు, కార్పోరేట్ దాతలకు, అంతర్జాతీయ కార్పోరేట్ కంపెనీలకు ఇవి మారు సంస్థలు. అభివృద్ధి తెచ్చిపెట్టే సమస్యలపై ప్రయోగించే మాయ తూటాలు. వీటిది సంక్షేమ సామ్రాజ్యవాదం. దాతృత్వ వ్యాపారం. ప్రజాపక్షం వహించే వ్యక్తులు, రాజకీయ శక్తులు ఎన్జీవోల పట్ల తమ వైఖరిని ఇప్పటికైనా స్పష్టం చేసుకోవాలి. బి. చంద్రశేఖర్ గుంటూరులో న్యాయవాది. మానవ హక్కుల కార్యకర్త. 'శాక్కొ-వాంజెట్టి' గ్రంథ రచయిత. వివిధ పత్రికలలో అనేక వ్యాసాలు రాశారు.