
NIGRAHA VAKYAM - SAHITYA VIMARSHA
₹250
In stock · 72 available
PublisherSATISH CHANDAR
LanguageTelugu
వ్యాసాలు శ్రీశ్రీ నుంచి నెరూడా వరకూ... రూపం వ్యాసం కావచ్చు. సారం విమర్శే. అది సెమినార్ లో చదివిన వ్యాసం కావచ్చు, స్మారక వ్యాసం కావచ్చు. వాద వివాదాల నేపథ్యంలో రాసిన వ్యాసం కావచ్చు. ఏదో ఒక కొత్త పరిశీల వుంటుంది. ఏ డిస్కవరీ లేనప్పుడు ఈ రచయిత వ్యాసం జోలికే పోడు. 'ప్రేమ లేఖ లేచి పోవడం' మీద రాసినా, 'నెలవంక కత్తి దూయటం' మీద రాసినా సామాజిక, ఆర్థిక, రాజకీయ నేపథ్యాల్లో నుంచే విశ్లేషణ వుంటుంది. ఆయన రాసిన కొన్ని వ్యాసాలు ('పాట'కు పరాయి పల్లవి-లాంటివి) సాహిత్యంలో కొత్త ఉద్యమాలకు తెరలేపాయి. 'వ్యాసాలు' అన్న ఈ విభాగంలో కవిత్వం, కాల్పనిక సాహిత్యం, కాల్పనికేతర సాహిత్యం, భాష, భారతీయాంగ్ల సాహిత్యం, విశ్వసాహిత్యం అనే ఉప విభాగాలున్నాయి. శ్రీశ్రీ, శివసాగర్, నగ్నముని, అజంతా, సావిత్రి, రోణంకి, చాసో, రమణ, పతంజలి, గోరాశాస్త్రి వంటి ఉద్దండులయిన తెలుగు రచయితల మీదా, ఎ.కె.రామానుజన్, డామ్ మోరేస్ వంటి ప్రముఖ భారతీయాంగ్ల రచయితలపైనా, పాబ్లోనెరూడా, బెట్రోల్డ్ బెక్ట్ వంటి విశ్వ రచయిల మీదా రాసిన వ్యాసాలతో పాటు, వివిధ ధోరణుల పై పరిశీలనులున్నాయి.