
NIJALU
₹225
In stock · 25 available
PublisherSRI MUNDRA BASAVAYYA
LanguageTelugu
ముందు మాట "అల్పాక్షరములందు అనల్పార్థ రచన కల్పించుటయె కాదె కవి వివేకంబు” అనే ఉక్తి పాల్కురికి సోమనది. పరిమిత కాలంలో అభిలిషితార్ధాన్ని అందివ్వగలడము సామాన్య విషయము కాదు. ఎంతో సాధన చేస్తేనే సాధకుడికి సాధ్యమవుతుంది. ఆ సాధనయే తపస్సు. ఆ తపస్సులో తాపసికి నిగ్రహమున్నప్పుడు, దానిని శబ్ధ ప్రయోగంలో వినియోగించగలిగినప్పుడు, అతని గళం నుండి జాలువారే గేయం అమృత సమానమవుతుంది. Brievity is the soul of wit సోమనాధుని ఆలోచనకు ప్రతిధ్వని. తెలంగాణా ప్రాంతపు మాగాణం నుండి వచ్చిన కవిత్వపు అగ్నికణము పాల్కురికి సోమన. బసవపురాణమును జనజీవన యాసతో కూడిన భాషలో వెలువరించిన సోమన తొలి తెలుగు శతకమైన వృషాధిపశతకపు కర్త. సోమన నడయాడిన కాకతీయుల కదన సీమపు మరో కమ్మటి కాపు బ్రాహ్మణుడు బమ్మెర పోతన. తన కవిత్వము తనకు స్వంతమని, మనుగడకు గడపగడపకు వెళ్ళి యాచించవలసిని పని లేదనీ, అనర్హులకు తన కవితాకన్యకను ఇచ్చి అపాత్రదానం చేయననీ, ప్రతిన పూనిన సహజ పండితుడు మన బమ్మెర పోతన. ఒక చేత కలము మరో చేత హలముతో కవితా జీవన సేద్యము చేసి తెలుగువాళ్ళకు తీయని భాగవత సుధను మధుర ఫలములుగా అందించిన పోతన వారసులు అనేకులు ఉన్నారు తెలుగు సీమలో. పోరాటాల పేట సూర్యాపేట జిల్లాలోని కోదాడ పట్టణ ఆవాస గ్రామం తమ్మర. భక్త కవిశేఖర నరహరి గోపాలాచార్య పదములతో పులకరించిన ఈ గ్రామంలో, ఒకప్పుడు అధ్యాపక వృత్తిలో ఉన్నట్టి కమ్మటి మనస్తత్వము గల వారు ముండ్రా బసవయ్య గారు. వీరు డెబ్బై యేళ్ళ యువకులు. మా అమ్మగారు రుక్మిణమ్మకు బడిలో పాఠాలు నేర్పిన మాస్టారు. దోరకుంట గ్రామానికి చెంది, కోదాడ పరిసర ప్రాంతాలలో అవిశ్రాంతంగా చదువుల గుడులు అయిన బడులలో అర్చకత్వము చేసి, పుత్ర వియోగ దుఃఖంతో స్వచ్ఛందంగా ఉద్యోగ విరమణ చేసిన సున్నిత మనస్తత్వము కలవారు ముండ్రా బసవయ్య గారు.