
NIJAYITEEKI BAHUMATHI - 50
by NARAM SHETTI UMA MAHESWARA RAO
₹50
In stock · 635 available
PublisherVISALAANDHRA PUBLISHING HOUSE
LanguageTelugu
గుణపాఠం పూర్వం శిళ్ళంగేరి గ్రామంలో రత్నాలయ్య అనే వ్యాపారి వుండేవాడు. అతడు పిసినారి. డబ్బొస్తుందంటే ఏపని చేయడానికైనా వెనుకాడడు. తనకి ఎంత ఆస్తివున్నా ఇంకా గడించాలన్న తపనతో ఎన్నో చెడ్డపనులు చేసేవాడు. అతడుచేసే చెడ్డపనులలో దొంగిలించిన వస్తువులు కొని దొంగల్ని ప్రోత్సహించే పని ఒకటి. దొంగలకు అవసరానికి సొమ్ము ఇచ్చి వారిచే దొంగతనం చేయించి, ఆ దోపిడీ వస్తువులను సగం ధరకు కొనేవాడు. రత్నాలయ్య భార్య రంగమ్మ మంచిది కావడం వల్ల భర్త చేసే పనులను ప్రతిఘటించేది. “పాముకి పాలు పోసినా విషమే ఇస్తుంది. దొంగలకు ఆశ్రయమిస్తే లాభం కన్నా నష్టమే ఎక్కువ! డబ్బు గడించడానికి ఎన్నో పద్ధతులుండగా, ఇలాంటి చెడు మార్గం పట్టడం మంచిది కాదండీ!" అని ఎన్నోసార్లు చెప్పినా, అతడు వినేవాడుకాదు. "నువ్వు నోర్మూసుకో! నాకంటే నీకే బాగా తెలిసినట్టు మాట్లాడకు” అని కసిరేవాడు రత్నాలయ్య! ఒకనాటి అర్థరాత్రి ఎవరో తలుపు తడితే రత్నాలయ్య వెళ్ళి తెరిచాడు. అవతల వున్నది తను ప్రోత్సహించే దొంగల్లో ఇద్దరు! వాళ్ళు శివయ్య, మునయ్య. అలా అర్ధరాత్రి వేళ దొంగ సొమ్ముతో వచ్చి