
NINDU NOORELLU AROGYANIKI HOMEO VAIDYAM - 30
₹30
In stock · 9 available
PublisherSRI BALAJI PUBLICATIONS
LanguageTelugu
హోమియోపతి వైద్యము గ్రీక్ భాషలో హోమియో అనగా సారూప్యము గల విధానము అని అర్ధము. లాటిన్భాషలో పతి అనగా బాధ అని అర్థము. హోమియోపతి అంటే సారూప్యము గల బాధ అని అర్ధము. జర్మనీ దేశములో ప్రసిద్ధుడైన హోమియోపతి వైద్యుడు డా॥హానిమాన్ 1838వ సంవత్సరములో పంజాబ్లోని మహారాజా సింగ్కు చికిత్స చేయుటకు డా॥ జాన్ మార్టిన్ హోనింగ్ బర్గర్ అనే విద్యార్థి ఆహ్వానముపై మనదేశానికి రావడం జరిగింది. అప్పుడు భారతదేశములో హోమియోపతి వైద్య విధానము ఆరంభమైనది. తూర్పు గోదావరి, పశ్చిమగోదావరి, గుంటూరు జిల్లాలలో కొందరు వైద్యులు ఈ హోమియో వైద్య విశిష్టతను ప్రచారము చేశారు. డా॥ జె.వి రమణయ్య నెల్లూరు జిల్లాలో హోమియో వైద్య విధానములో అవిరామ కృషి చేశారు. విజయవాడలో డా॥ వావిలాల శ్రీనివాస మూర్తి గారు "ఆంధ్రా ప్రొవెన్షియల్ హోమియోపతిక్ ప్రాక్టీషనర్స్ ఫెడరేషన్' అను ఒక సంస్థను స్థాపించారు. మంచి ఆరోగ్యము గల మానవుని మీద ఒక ఔషధమును ప్రయోగించినపుడు ఏ లక్షణములైతే కనిపిస్తాయో ఆ లక్షణ సముదాయము రోగికి ఉన్నప్పుడు ఆ ఔషధమే ఆ లక్షణములను తొలగించి రోగికి స్వస్థత చేకూర్చును. దీనినే సిమిలియా సిమిలిబస్ క్యూరెంటర్ అని అంటారు. పై సూత్రముల మీద రుజువు చేయబడిన మందులకు ఐదు రకములైన తేడాలు కలవు. సహాయకారి మనము ఒక మందును రోగికి ఇచ్చినపుడు అది పూర్తిగా వ్యాధిని నయము చేయలేనప్పుడు లేదా వ్యాధి మరలా తిరిగి వచ్చినప్పుడు ఇచ్చే వేరొక మందును "సహాయకారి' అంటారు.