NINDU YAVVANAM by SHANMUKESWARA PRACHURANALU Telugu book cover

NINDU YAVVANAM

by SHANMUKESWARA PRACHURANALU

₹90
In stock · 3 available
PublisherSHANMUKESWARA PRACHURANALU
LanguageTelugu
ప్రేమ స్వేచ్ఛ ప్ర : ప్రేమదేనికి? సంసారంలోకి లాగి, ఆడదాన్ని అధపాతాళానికి తొక్కడానికేనా? స్వేచ్ఛా ప్రేమ, స్వచ్ఛప్రేమ, రచ్చప్రేమ... ఇలా ప్రేమల్ని రకరకాలుగా పొందవచ్చు. ఈ మూడింటికీ దేని ప్రయోజనాలు దానికున్నాయి. దేని వికారాలు దానికున్నాయి. ప్రేమలోని నిజమైన ఆచరణీయత అర్ధం అయితే ప్రేమ సార్ధకం అవుతుంది. స్వేచ్ఛ ప్రేమ స్వేచ్ఛ ప్రేమ సంఘం (ఫ్రీ లవ్ సొసైటీ) అనేది ఒక అంతర్జాతీయ సంస్థ. చలంగారు బెజవాడలో ఉన్న రోజుల్లో అది ఇక్కడా కూడా ఉండేదని పెద్దలు చెప్తారు. పెళ్ళిళ్ళు, కడుపులు, వ్యభిచారాల్లాంటి జంజాటాలకు అతీతమైన ప్రేమని ఈ సంస్థ ప్రబోధించేది. అన్ని మతాలు స్వేచ్ఛప్రేమని వ్యతిరేకిస్తాయి. కాబట్టి మతఛాందస వ్యతిరేకోద్యమంగా ఇది మొదలైంది. స్త్రీ పురుష బంధాల్ని కట్టుబాట్ల చట్రంలో బిగించటాన్ని ఈ ఉద్యమం వ్యతిరేకించేది. దీని దృష్టిలో పరిణతి పొందిన స్త్రీ పురుషుల మధ్య భావోద్వేగ పరమైన సంబంధాలూ, వివాహేతర సంబంధాలూ గౌరవనీయమైనవే! ప్రేమించవలసిందిగా వేధించే యాసిడ్ ప్రేమికుడికి, సెక్సు కోసం కార్యని వేధించే భర్తకీ మధ్య మనస్తత్వ పరంగా ఎలాంటి తేడా లేదనీ, వివాహవ్యవస్థ అనేది రేప్ చేసే హక్కులిచ్చేది కాదని 'ఫ్రీ లవ్ ఉద్యమం' వాదిస్తుంది. స్త్రీలకు 'ప్రేమ స్వాతంత్య్రం' ఉండాలనే లక్ష్యంతో ఈ ఉద్యమం సాగింది. స్వచ్చప్రేమ స్వాతంత్ర్యోదమం తొలినాళ్లలో తెలుగు నేలపైన భావకవితోద్యమం నడిచింది. రాయప్రోలు సుబ్బారావుగారు 'అమలిన శృంగారం' సిద్ధాంతాన్ని వెలుగులోకి తెచ్చారు. సరస సాంగత్య సుఖ వికాసములకన్నా దుస్సహ వియోగమే ఎక్కువ సుఖవంతమైందనే భావాన్ని ప్రచారం చేశారు.