
NIRUPAMANA DESABHAKTULU - PASALA KRISHNAMURTHY, ANJALAKSHMI
₹100
In stock · 1 available
PublisherGADAM GOPALASWAMY
LanguageTelugu
పసల కృష్ణమూర్తి దంపతుల ద్వితీయ కుమార్తె కృష్ణభారతికి 2022 జులై 4వ తేదీన భీమవరంలో అల్లూరి విగ్రహావిష్కరణ సందర్భంగా పాదాభివందనం చేస్తున్న ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ స్వాతంత్య్ర సంగ్రామ చరిత్రలో వెలుగులోకి రాని ప్రాంతీయ పోరాటగాథలను పసల దంపతుల కథ వెలుగులోకి తీసుకువచ్చింది గోదావరి ప్రాంత స్వాతంత్య్ర సమరయోధుల త్యాగాల చరిత్రకు ఈ పుస్తకం సజీవ సాక్ష్యం. డా. మండలి బుద్ధప్రసాద్, శాసన సభ్యులు గాంధీజీ ఆశయాలను తమ జీవితంలో ప్రతిఫలింపజేసిన ఈ శ్రేష్ఠ స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాన్ని ఈ పుస్తకం గౌరవంగా ఆవిష్కరించింది. ముందు తరాలకు స్ఫూర్తిదాయకంగా నిలిచే విప్లవకథ ఇది. ఎ. వి. రాజమౌళి, సీనియర్ ఐ.ఎ.ఎస్. మనం ఇలా స్వేచ్ఛగా ఉండటానికి ఎంత మంది తమ జీవితాలను అర్పించారో ఈ పుస్తకం చదివితే తెలిసొస్తుంది. వారిపట్ల కృతజ్ఞతా భావం వెల్లివిరుస్తుంది. ఎం.నాగేశ్వరరావు, ఎడిటర్, ఈనాడు పసల కృష్ణమూర్తి, వారి శ్రీమతి అంజలక్ష్మి నైష్ఠికతతో దేశసేవ కోసం చేసిన త్యాగనిరతి, ఫలితంగా వారనుభవించిన కష్టాలు పరికిస్తే ఒళ్ళుగగుర్పొడుస్తుంది. - ప్రొ|| వకుళాభరణం రామకృష్ణ, చరిత్ర అధ్యాపకులు ఈ గ్రంథ రచయితలు ఇద్దరూ చరిత్రలో నిపుణులు, రచనలో ప్రవీణులు. డాక్టర్ గాదం గోపాలస్వామి గారు, సహ రచయిత టి. శ్రీ వేంకట రంగనాయకులు గారు ఎంతో శ్రద్ధ, నిబద్ధతతో ఈ గ్రంథాన్ని రచించారు. పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించిన అనేక చారిత్రక ఆధారాలను అధ్యయనం చేసి, విశేష పరిశోధన జరిపారు. ఇద్దరూ పత్రికా రచయితలే కాకుండా, ఉత్తమ అధ్యాపక పురస్కారాలు పొందిన విద్యావేత్తలు కూడా!