
NITYA JEEVITHAMLO DYANAM
₹90
In stock · 7 available
PublisherSHANMUKESWARA PRACHURANALU
LanguageTelugu
నిత్యజీవితంలో ధ్యానం నిత్యజీవితంలో ధ్యానం ప్రపంచం ఎంతో అభివృద్ధి చెందింది. చెందుతూనే వుంది. మానవ మేథస్సుకు ప్రతీకగా నిలిచింది ఈ 2000వ సంవత్సరం. ఎంతోమంది మేధావుల కృషి ఫలితాలనెన్నిటినో ఇవాళ మనం అనుభవించగలుగుతున్నాం. అనుభవించగలిగే అవకాశాలు మనకు ఎన్నున్నాయో.... అందుకు ఆటంకాలుగా అనారోగ్యాలు, రకరకాల సమస్యలూ కూడా అన్నే వున్నాయి. ఇవన్నీ కూడా మనిషిని మానసికంగా ఎంతో కృంగదీస్తున్నాయి. ఈ ఆధునిక యుగంలో కాలంతోపాటు మనిషి పరుగెత్తవలసిన అవసరం ఏర్పడింది. లేకపోతే అనుకున్నది సాధించలేమేమో అన్న ఆందోళన పెరిగింది. ఈ ఆందోళనతో కూడిన పరుగుతో సరైన ఆలోచనలు రాక, అవగాహన లేక ఎన్నో పరాజయాలను మనం పొందటం... మానసికంగా కృంగిపోవటం జరుగుతుంది. మానసిక ప్రశాంతత లేక కృంగిపోవటమనేది... ప్రమాదకరమైన అనారోగ్యం. శరీరానికి సంబంధించిన అనారోగ్యాన్ని బాగుచేసుకోవడానికి ఎన్నో మందులున్నాయి. మానసికమైన అనారోగ్యానికి సైకియాట్రిస్ట్లు, సైకోథెరపీలు ఆధునికంగా వచ్చినా... సంపూర్ణ ఫలితాలను పొందటం తాత్కాలికమే అవుతుంది. పైగా ధన వ్యయంతో కూడుకున్నది. మానవ జీవితంలో.... సుఖ-దుఃఖాలు, కష్ట- నష్టాలు సామాన్యంగా ఎదురవుతూనే వుంటాయి. సుఖాలకు పొంగిపోవడం..... కష్టాలకు కృంగిపోవడంతో చాలామంది సతమతమవుతుంటారు. నిత్యజీవితంలో ఎన్నో రకాల పరిస్థితులు. ఏవేవో బాధలు. ఎన్నెన్నో ఒత్తిడులు... ఇవన్నీ మనశ్శాంతికి పెద్ద అవరోధాలవుతున్నాయి. వీటిని అధిగమించి మానసిక శక్తిని పెంపొందించుకోవడం ఎలా? మానసిక శక్తితో మనం అనుకున్నది సాధించడం ఎలా??