
NOBLE SAHITYA PURASKAROPANYASALU
₹249
In stock · 3 available
PublisherKALAJYOTI PROCESS PVT LTD
LanguageTelugu
నోబెల్ బహుమతి ప్రదాతల, గ్రహీతల ఉపన్యాసాల పరంపర ఇది. ఈ వ్యాస సంపుటి మిసిమి మాసపత్రికలో వస్తున్న రోజుల్లో పాఠకులు తమ హృదయ స్పందనలను తెలియజేసేశారు. 'మా నాన్నగారి సూట్కేస్' అన్న అనువాదం చదివి, వారి నాన్నగారికి అలాంటి సూట్కేస్ ఉండేదని, వారి యౌవన కాలంలోని అనుభవాలను ఈ అనువాదం గుర్తుచేసిందని ఒక పాఠక మహాశయులు చెప్పారు. సిద్ధార్థ పబ్లిక్ స్కూల్ తెలుగు పండితులవారు ఈ అనువాదాన్ని చదివి, తమ అనుభవాలు, అనుభూతులు పంచుకునేవారు. ఇవి విద్యార్థులకు ఎంతో ఉపయుక్తంగా ఉంటాయని వారితో చదివించేవారు. ఈ గ్రంథం పరిశోధక విద్యార్థులకు వెలకట్టలేని నిధి. ఆధునిక గాంధీయన్ బి.వి. రామిరెడ్డి సాధారణంగా, నిస్వార్థంగా జీవనం గడుపుతూ ఇప్పటికీ విద్యార్థులకు పాఠాలు చెప్పటంలో ఆనందాన్ని పొందటమేగాక, సమాజ సేవ చేస్తున్నారు.