NPH - KARUNASREE SAHITYAM - 2 by DR.JANDHYALA PAPAYYA SASTRY Telugu book cover

NPH - KARUNASREE SAHITYAM - 2

by DR.JANDHYALA PAPAYYA SASTRY

₹350
In stock · 10 available
PublisherNAVACHETHANA PUBLISHING HOUSE
LanguageTelugu
Karunasree Saahityam - 2 డా॥ కరుణశ్రీ జీవించినంతకాలం కవిత్వం వ్రాసి కవిత్వం వ్రాసినంతకాలమే జీవించిన మహాకవి ఆయన. తన కవిత్వాన్ని ప్రజల నాలుకలపై నాట్యం చేయించిన ప్రజాహృదయాస్థాన కవి ఆయన. తన రచనలతో పాఠకులను మురిపించి మైమరపించిన మధురకవి ఆయన. 4-8-1912-21-6-1992 పిన్నలకు-పెద్దలకు, పామరులకు-పండితులకు అందరికీ అర్థమయ్యేలా కమ్మని కవిత్వాన్ని సౌందర్య సందేశాత్మకంగా అందించిన సుకవిచూడామణి ఆయన. ఆయన జంధ్యాల పాపయ్యశాస్త్రి, కలంపేరు కరుణశ్రీ. పుట్టింది కొప్పర్రు. పెరిగింది కొమ్మూరు. రెండు గ్రామాలూ గుంటూరు జిల్లాలోనివే. ఆయన తల్లిదండ్రులు మహాలక్ష్మమ్మ, పరదేశయ్య. అర్ధాంగి అనసూయాదేవి. ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె. అమరావతిలోని శ్రీరామకృష్ణ హైస్కూలులోనూ, గుంటూరులోని స్టాల్ గర్ల్స్ హైస్కూలులోనూ, ఏ.సీ కాలేజీలోనూ అధ్యాపకవృత్తి చేపట్టారు. కవిగా, పండితుడుగా, విమర్శకుడుగా, వ్యాఖ్యాతగా, సంపాదకుడుగా, బాల సాహిత్య కథకుడుగా, ఉపన్యాసకుడుగా బహువిధ ప్రతిభామూర్తిగా భాసించారు. వీరు చిన్నవీ, పెద్దవీ మొత్తం 76 గ్రంథాలు రచించారు. ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ విశిష్ట సభ్యత్వాన్ని అందుకోవటం, ఢిల్లీలో అఖిల భారత కవిసమ్మేళనంలో పాల్గొనటం, విజయవాడలో సువర్ణ ఘంటాకంకణ, కనకాభిషేక సన్మానాలు పొందటం, తెలుగు వెలుగుగా నాటి రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్.టి.రామారావుగారి నుండి సత్కారం గ్రహించటం, రాష్ట్రపతి జ్ఞానిజైల్సింగ్గారి చేత ఢిల్లీ ఆంధ్రాభవన్లో గౌరవింపబడటం, ఎస్.వి.యూనివర్శిటీ వారి డి.లిట్. పట్టా తీసుకొనటం, తిరుమల తిరుపతి దేవస్థానంవారి పోతన భాగవతం ప్రాజెక్టుకి ప్రధాన సంపాదకుడుగా వ్యవహరించటం ఆయన జీవితంలో మరపురాని సన్నివేశాలు. గాయకసమ్రాట్ ఘంటసాలవారి కంఠంలో అద్వైతమూర్తి, సాంధ్యశ్రీ, పుష్పవిలాపం, కుంతీకుమారి, అంజలి, కరుణామయి, ప్రాభాతి కావ్య ఖండికలూ హెచ్.ఎం.వి.రికార్డులుగా వెలువడ్డాయి. ఉదయశ్రీ ప్రథమభాగం 50 ముద్రణలతో స్వర్ణోత్సవాన్నీ, విజయశ్రీ, కరుణశ్రీ కావ్యాలు 25 ముద్రణలు దాటి రజతోత్సవ ముద్రణాన్నీ రవీంద్ర భారతిలో జరుపుకొన్నాయి. "ఉదయశ్రీ" ఐదవభాగానికి సాహిత్య అకాడమీ పురస్కారం, “అమర్భయామ్” కావ్యానికి పొ. శ్రీ. తెలుగు విశ్వవిద్యాలయ పురస్కారం లభించాయి. ఆయన సాహిత్యంపై 3 పి.హెచ్.డి. సిద్ధాంతవ్యాసాలు, 3 ఎం.ఫిల్. సిద్ధాంతవ్యాసాలు వచ్చాయి.