
NPH - KODAVATIGANTI KUTUMBARAO KATHALU-250
by PROF.KETHU VISWANATHA REDDY
₹250
In stock · 17 available
PublisherNAVACHETHANA PUBLISHING HOUSE
LanguageTelugu
అనాధ రక్షణ ఇందిరకు పట్నం నిండా స్నేహితులే. వాళ్ళల్లో నేనూ ఒకణ్ననుకోండి. కాని నే నెరిగినంత బాగా ఇందిరని మరెవ్వరూ ఎరగరని నా నమ్మకం. ఇందిరకు కాస్తో కూస్తో పిచ్చి ఉందని తెలుసుకున్నవాణ్ణి నే నొక్కడే! ఇందిర ఇంటర్మీడియెట్ పాసయింది. ఆమె కింకా పెళ్ళి కాలేదు, ఇక కాదు. వాళ్ళ అమ్మా నాన్నా ఇందిర నింటికి రానివ్వరు. ఇందిర తన ఎత్తు ధనం పోసినా అమ్మ దగ్గిరికీ, నాన్న దగ్గిరకి వెళ్ళాలిసిన అవసరంలే దిందిరకు. ఇందిర పినతండ్రి కొడుకు సోమయాజులు ఆభోగం వాళ్ళమ్మాయిని పెళ్ళాడి, ఉద్యోగం చేస్తూ పట్నంలో ఉన్నాడు. ఆ పెళ్ళిని అందరికంటే ముందుగా రెండు చేతులూ ఎత్తి ఆశీర్వదించినది. ఇందిరే! సోమయాజులుగారిల్లు కేంద్రంగా పెట్టుకుని ఇందిర పరిభ్రమిస్తూ ఉంటుంది. నవమస్థానంలో కాబోలు శనో ఏదో ఉండటం మూలాన ఇందిర ఇతర్ల కష్టాలు చూసి భరించలేదు. ఓ మాట సలహా గాని, యధాశక్తి చాకిరి గాని, ఎవరిదగ్గిర్నించన్నా తీసుకుని ఓ అయిదు రూపాయల నోటు గాని అనాధల కివ్వకుండా ఇందిరకు రోజు గడవలేదు. నా కిందిర పరిచయం ఎట్లా అయిందో చెప్పటానికి కొంచెం సిగ్గుగా ఉంది. "ఇందిరకంటె సులభంగా చేతి కందే మనిషి ఉండబోదు" అని ఓ స్నేహితుడు జారవిడిచాడు. "డబ్బు మాట?" అన్నాను, కాస్త జాగర్త మనిషిని గనక. నా స్నేహితుడు నవ్వి, "ఇందిర ఎట్లాగైనా డబ్బు వొదిలిస్తుంది- పరిచయంకూడా అక్కర్లేదు, మొహం ఎరిక ఉంటేనే చాలు.. అయితే ఎన్నడూ సొంతానికని అడగదు ఎప్పుడూ లోకోపకారార్థమే!” ఇందిరతో పరిచయం అయింతరువాత నా స్నేహితుడికి ఊహాశక్తి లేదని తెలుసుకున్నాను. అతను నాకు ఇందిర ఆడతనం ఆశ చూపాడు గాని, అసలామనిషి