
NUVVE OKA SAMUHAM - POETRY
₹150
In stock · 45 available
PublisherPALAPITTA BOOKS
LanguageTelugu
ISBN9788198652324
డా. మహమ్మద్ హసేన కవిత్వం నాకెవరున్నారని పదే పదే బెంగపడతావెందుకు నిశి రాత్రికి వెన్నెలద్దే జాబిలి సైతం ఒంటరే ఒంటరి తనం నీ కొక్కడికే అనుకుంటున్నావేమో నది పుట్టుక కూడా ఒంటరిగానే మొదలౌతుంది ఏ కదలిక లేకుండా కాలమెలా నడుస్తుంది పోరాటమే లేకుండా విజయమెలా వరిస్తుంది కారణం లేకుండా కార్యమెలా జరుగుతుంది ఆరంభం లేకుండా అంతమెలా ఉంటుంది అంగుళమంత అగ్గిరవ్వ అడవిని దహిస్తుంది అంకుశం చిన్నదైన మదగజాన్ని నియంత్రిస్తుంది అద్దం చిన్నదైనా ఆకాశాన్ని చూయిస్తుంది జాబిల్లి చిన్నదైన జగతికి జ్యోతినిస్తుంది పుస్తకం చిన్నదైన మస్తకంపై నిలుస్తుంది వాన చినుకు చిన్నదైన జీవకోటికి ప్రాణాధారమౌతుంది అక్షరం చిన్నదైన ఆయుధమై పోరాడుతుంది పాలపిట హైదరాబాద్ -బుక్స్ 9 788198 652324