
O BUDDHA
₹50
In stock · 10 available
PublisherVISALAANDHRA PUBLISHING HOUSE
LanguageTelugu
అసలు విషయం ఒకనాడు అనిపించింది- 'బుద్ధుడి మీద పుస్తకం రాయాలి'- అని. అందుకు పూనిక వహించాను. బౌద్ధ సాహిత్యంతో రెండు మాసాలు సాన్నిహిత్యం చేసాను. కృషి ఫలించింది. నా కృతి పూర్తయింది. అయితే నాలో ప్రశ్నలు బారులు తీరాయి. 'బౌద్ధ రచనకు నాకు గల యోగ్యత ఏ పాటిది? 'మేజిక్' రచయితగా ముద్ర పడిన వాడిని- నా ఈ 'బైరాగి'ని ఎవరు పఠిస్తారు? ఎవరు సంబర పడతారు?' ఆ సందేహాలు నన్ను భయ పెట్టాయి. పుస్తక ప్రచురణ ఉత్సాహం నాలో చచ్చిపోయింది. అప్పుడో విషయం గుర్తుకు వచ్చింది. అది బుద్ధుడికి సంబంధించినదే. అతడు జ్ఞానోదయం పొందాడు. సంతోషించాడు. కాని అంతలోనే నిస్పృహ కూడ చెందాడు. 'నేను బోధిస్తే ఎవరు వింటారు? ఎవరు అర్థం చేసుకుంటారు? ఎవరు ఆచరిస్తారు?' అనుకున్నాడు. తనకు తెలిసిన సత్యాన్ని తనలోనే దాచుకుందా మనుకున్నాడు. మరల పున రాలోచించాడు. తన జ్ఞానాన్ని అందరికీ పంచటమే ధర్మం అని తలచాడు. అయితే అతడు నిజంగానే తన తొలి బోధ సందర్భాన ముందుగా తిరస్కారానికే గురయ్యాడు. అతడిని ఉపేక్షించిన అయిదుగురు సన్యాసులూ అటు పిమ్మట అతడి శిష్యులుగా మారారు. ఆ సంఘటనను స్ఫూర్తిగా తీసుకున్నాను. గ్రంథ రచనకు 'హేతువాదం' నా అర్హతగా భావించాను. పుస్తకంగా తీసుకువచ్చాను. అదే ఈ 'ఓ బుద్ధా'. ఇది అతడి ప్రతిబింబం. చిన్నదే కావచ్చు, కాని అచ్చమైనది. నా గ్రంథంలోని వ్యక్తులు ఎవరు, ఎపుడు, ఏడ, ఎలా పలికితే సహజంగా ఉంటుందో దానికి తగినట్లుగా మాటలనూ, సూక్తులనూ, బోధలనూ కుర్చాను, పేర్చాను. సంభాషణలను క్లుప్తం చేసాను. వాక్యాలేమో చిన్నవి. పదాలను పొదుపుగా వాడాను. బుద్ధుడికి జ్ఞానోదయ సమయాన కలిగాయి అనుకునే - పూర్వ జన్మల స్మృతులూ, దివ్య దృష్టులూ- అనే మానవాతీత శక్తులను నేను తొలగించాను. దానికి బదులుగా- ఆ నాటికి బుద్ధుడికి ఉండగల జ్ఞానం ఆధారంగా, అతడి స్థానంలో నేను కాసేపు, కాసేపుగా ధ్యానం చేసాను రాగల అంతిమ ఫలితాన్ని ఎదురుగా ఉన్న కాగితం మీద ముందుగా రాసుకునే.