O JWALINHCE DALITHA NEE CHAITANYAMEKKADA by VEETHI MURALIKUMAR Telugu book cover

O JWALINHCE DALITHA NEE CHAITANYAMEKKADA

by VEETHI MURALIKUMAR

₹75
In stock · 5 available
PublisherVEETHI MURALIKUMAR
LanguageTelugu
ఒక్క నిమిషం...! నా మాటలో... చిన్నతనం నుండి డా॥ అంబేడ్కర్ అంటే అభిమానం, భక్తి భావం. కోట్లాది దళిత బహుజన మైనార్టీలు ఈనాడు ఇంత ఉన్నత స్థితికి చేరుకున్నారంటే ఆయనకు జాతి పట్ల ప్రేమ, కరుణయే కారణం. ఆయన నిస్వార్ధ సేవకు యావత్తు దేశ ప్రజలంతా ఋణపడి ఉన్నారు. ఆ ఋణం తీర్చుకోవాలంటే ఆయన ఆశయ సాధన దిశగా మనవంతు కార్యక్రమాలు చేస్తూవుండాలి. అందులో మన భాగస్వామ్యం ఉండాలి అనే ఆలోచనతో డా॥ బాబా సాహెబ్ అంబేడ్కర్ సూక్తులు వ్రాయాలని ప్రేరణతో మొదలుపెట్టిన నన్ను ఆయన నాటిన విత్తనం వృక్షంగా పెరిగి విస్తరించి దాని కాచిన పండ్లు తింటూ దాని నీడను సేదదీరుతున్న దళిత బహుజనులను చూచి ఓర్వలేని అగ్రవర్ణ ఆధిపత్య కులాలకంటగింపు దాన్ని వ్రేళ్ళను నరుకుతున్న తీరు, దాని పునాదులను ధ్వంసం చేయజూస్తున్న వారి కుట్ర, కుతంత్రాలు ఒకవైపైతే, మరోవైపు మనలోని అనైక్యత, అసంఘటిత తత్వం "అంతరించిన దళిత ఉధ్యమాలు, “రిజర్వేషన్ల సమస్యలు”, “రాజ్యాధికారం”, “ఓటు చైతన్యం” అనే అంశాలు నన్ను వాటివైపుకు లాక్కుపోతున్నాయి. ఆ ఆలోచన ధార ఈ పుస్తకం వ్రాయడానికి పురికొల్పింది. నా దగ్గర ఆ మహానుభావుని పుస్తకాలతో పాటు, దళిత సాహిత్యానికి సంబంధించిన ఎంతోమందివి ఎన్నో పుస్తకాలు, దళిత రచయితలకు సంబంధించినవి నా స్వంత ఖర్చుతో కొన్నవే గాని ఉచితంగా ఎక్కడా పొందలేదు. ఈ పుస్తకాలు జ్ఞాన సముపార్జితాలు. వాటిని చదివినప్పుడు బాబా సాహెబ్ తనకోసం కాని, తన కుటుంబం కోసం కాని చూసుకోలేదు, దాచుకోలేదు. ఆ మహా పురుషుని స్ఫూర్తితో 1985 కారంచేడు ఉధ్యమంలో మా కాకినాడ రేచర్లపేట నుండి డా॥ అంబేడ్కర్ యూత్ సర్కిల్ వారు మరియు అంబేడ్కర్ స్పోర్ట్స్ యూనియన్ వారు మొత్తం 200 మంది మా ఊరి జనం “ఛలో హైదరాబాద్” కార్యక్రమానికి వెళ్ళాము. అప్పటి ఆ రోజులు గుర్తుకు తెచ్చుకుంటే కాకినాడ నుండి సికింద్రాబాద్ బయలుదేరిన మా బండి ఆగిన ప్రతి స్టేషన్లో ఎక్కేవారే గాని దిగేవారు కనబడలేదు. అలా క్రిక్కిరిసి నిండిన రైలును చూచి వీరంతా మావాళ్ళేనన్న ఆత్మభావన కలిగి ఒక ఆనందం కలిగింది. ఆ సమయంలో కాకినాడ రేచర్లపేట మా స్వగ్రామంలో "రైల్ రోకో” “బస్సు రోకో” కార్యక్రమాలు జయప్రధం గావించాము. మాకు రైల్వే లైను మరియు బస్టాండు కూడా మాకు దగ్గరగానే వుంటుంది. అందువలననేమో రైలును, బస్సులను కదలనివ్వలేదు. ఓ జ్వలించే దళితా! నీ చైతన్యమెక్కడ?