
O KOTHA BANGARU LOKAM
₹75
In stock · 44 available
PublisherA.RAGHAVASARMA
LanguageTelugu
ముందుమాట రాఘవ శర్మ గారు 2015 డిసెంబర్లో చైనాలో పర్యటించి వచ్చారు. ఆయన విన్నవి, కన్న వి, ఆ పర్యటన అనుభవాలు, అనుభూతులు ఒక్క ముక్కలో చెప్పారు "ఓ కొత్త బంగారు లోకం" అని. ఆ మాట ఎందుకన్నారో విస్తరిస్తే, వివరాల్లోకి వెళితే... ఈ యాత్రా సాహితి.. చిరుపుస్తకం తయారయ్యింది. ఈ పుస్తకాన్ని భారత-చైనా మిత్ర మండలి సంతోషంగా మీ ముందుకు తెస్తోంది. అత్యంత వేగంగా మారిపోతున్న నేటి ప్రపంచ ఆర్థిక, రాజకీయ, సాంఘిక, సాంస్కృతిక వాతావరణంలో వ్యక్తులు, సమాజాలు, దేశాలు తమ భవిష్యత్తు పట్ల, మానవాళి మనుగడపట్ల, ప్రపంచ శాంతి అభ్యుదయాల పట్ల ఆసక్తితో ఆలోచించుకోవలసిన అగత్యం ఏర్పడింది. తమ తమ సమాజాల, దేశాల అభ్యున్నతిలోనే ప్రజా సంక్షేమము, వ్యక్తిగత సౌఖ్యము ముడిపడి ఉన్నాయనే అవగాహన సామాన్యులలో విస్తారమవుతోంది. ఈ ప్రపంచంలో అనేక ధోరణులు, వాటి మధ్య సంఘర్షణలు, వాటి సంక్లిష్టతలు, వివిధ వర్గాలు ఆలోచిస్తూ, పరిష్కరించుకుంటూ ప్రజావళికి ఏవి మేలు చేస్తాయి అనే అంశాలను ఎప్పటికప్పుడు తేల్చుకుంటూ సాగవలసిన అవసరం ఏర్పడింది. ఈ కర్తవ్యంలో మేధావుల పాత్ర, వారి ఆలోచన, విశ్లేషణ ఎంతో ప్రభావశీ లంగా వుంటాయి. వ్యక్తిగత అభిరుచులు, ఇష్టాఇష్టాలు అటుంచి ఈ ప్రపంచాన్ని వస్తునిర్దేశంగా, వాస్తవ పరిస్థితుల ప్రాతిపదికగా, నిర్దిష్టంగా నిర్వచించుకోవలసిన సమయం వచ్చింది. గతంలోని భావాలు, భావోద్రేకాలు పక్కనపెట్టి వర్తమాన స్థితిగతులను క్షుణ్ణంగా పరిశీలించి, మూల్యాంకనం చేసుకోవలసిన పరిస్థితి వున్నది. అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతూ, ప్రపంచ ఆర్థిక వ్యవస్థను తన చుట్టూ తిప్పుకునే స్థాయిలో పురోగమించిన జన చైనా ఈనాడొక అబ్బురం, విస్మరించలేని అంశం. సహజంగానే ఆ దేశం పట్ల ప్రపంచమంతటా ఆసక్తి వున్నది. మనకు పొరుగు దేశం అవ్వడం వల్ల చారిత్రకం గా వేల సంవత్సరాల సాంస్కృతిక సంబంధాలు కలిగి వుండడం వల్ల మనకు మరింతగా ఆసక్తి వున్నది. అంతేకాక, అతిపెద్ద జనాభాకలిగిన చైనా, భారత దేశాలు రెండూ గతంలో ప్రపంచ నాగరికతను నిర్దేశించిన వారసత్వం కలిగి వున్నాయి. ప్రపంచ వస్తూత్పత్తిలో, వాణిజ్య వ్యాపారా లలో గణనీయమైన పాత్రను పోషించాయి. అయితే, పెట్టుబడిదారీ విధానాలు, సామ్రాజ్యవాద శక్తుల విజృంభణతో వలస పాలనకు, ఆర్ధిక దోపిడీకి గురయి ఈ రెండు దేశాలూ తమ ప్రాభవాన్ని కొంత కోల్పోయాయి. అయితే రెండు దేశాల ప్రజలు తమపై సాగుతున్న వలస పాలనకు, సామ్రాజ్యవాద శక్తులకు వ్యతిరేకంగా పోరాడి విజయం సాధించాయి. భారత దేశం ఇటు 1947లో బ్రిటిష్ పాలన నుండి స్వాతంత్య్రం పొందింది. 1949లో చైనా విముక్తిని ఓ కొత్త బంగారు లోకం