
O SAARI MANASU CHEPPEDI VINDAMA
₹80
In stock · 8 available
PublisherPANDRANKI SUBRAMANI
LanguageTelugu
ఒక మౌన నివేదన ఎందరో మహానుభావులు! సాహితీ ప్రస్థానంలో ఒకరా ఇద్దరా-నెమరువేసుకొని నమస్కరించడానికి మొదటిసారిగా తారసిల్లిన శ్రీ జి.చిరంజీవి (ప్రఖ్యాత కథా రచయిత, రిజర్వుబ్యాంకు ఉద్యోగి) విశ్వసాహితీ వేదిక వేపు దారి చూపించిన - ఆంధ్రప్రభ వీక్లీ సీనియర్ సబ్ ఎడిటర్ శ్రీబుద్ధవరపు కామరాజు (కలంపేరు తూళికాభుషణ్) గోర్కీగారి ఫామాగార్డెన్ తెనిగింపు ద్వారా (ఇది చదివిన తరవాతనే నేను గోర్కీ అభిమానిగా మారాను) నన్ను అమితంగా ఆకట్టుకున్న శ్రీ బెల్లం కొండరామదాసుకి తెలుగు భావకవిత్వపు శిఖరాగ్రం నిత్యవసంతం - నావి పది కథలు స్వయంగా అడిగి చదివి వ్యాఖ్యానించిన శ్రీ దేవులపల్లి కృష్ణ శాస్త్రి - మహాపండితులు "విశాలనేత్రాలు” నవలా రచయిత శ్రీపిలకా గణపతి శాస్త్రి - తెలుగు కథకు జీవం పోసి మొలకెత్తించిన సాహితీ కృషీవలుడు డా॥ రావూరి భరద్వాజ్ తెలుగు కథా శిఖరం శ్రీపాలగుమ్మి పద్మరాజు - తెలుగు కథా రచనలో రాజమార్గం వంటి శ్రీభమిడిపాటి రామగోపాలం - నా కథల్ని చదివి - కథాసంపుటిగా రావలసినవి అని ఉత్సాహపరచిన నిత్య సాహితీ ఆరాధకుడు - కథారచన ఋత్వికుడు శ్రీకాళీపట్నం రామారావు - మద్రాసు అభ్యుదయ రచయితల సంఘం నడుపుతూ నన్ను ఉత్సాహపరిచిన “కొల్లాయి గడితేనేమి?" నవలా రచయిత శ్రీమహీధరరావు మోహనరావు - నా కథా రచనల్ని ప్రొత్సహించి ప్రచురించిన మాణ్యికవీణ శ్రీవిద్వాన్ విశ్వం ప్రభ వీక్లీ ఎడిటరు ఆంధ్ర పత్రిక వీక్లీ ఎడిటరు శ్రీశివలెంక శంబు ప్రసాద్ ఆంధ్రజ్యోతి వీక్లీ సంపాదకులు శ్రీపురాణం సుబ్రహ్మణ్యం శర్మ - ఆ తరవాత నన్ను తమలో ఒకడిగా చేర్చుకున్న విశాఖ సాహితీ సమితి సభ్యులకు