
ODIPOVADDU
₹60
In stock · 11 available
PublisherJULURU GOWRI SHANKAR
LanguageTelugu
ముందుమాట తెగిస్తేనే తెలంగాణ సాధ్యం కాలాల్ని, లోకాల్ని త్యాగాలే ముందుకు నడిపిస్తాయి. ఏ కాలంలోనైనా కాలాన్ని సరైన భావజాలం ఆచరణ కలగలిసి వున్న మూర్తిత్వాలే ముందుకు నడిపిస్తాయి. ఇది తరతరాల చరిత్ర అందించిన త్యాగాల చరిత్ర. ఒక వ్యక్తి తనకోసం కాకుండా ఒక సమూహం కోసం, ఒక సమాజం కోసం అంకితం కావడం, అర్పితం కావడం కన్న మించినది ఈ ప్రపంచంలో ఇంకొకటి లేదు. ఈనాడు ప్రపంచమంతా మార్కెట్ మయంగా మారినా, నరనరాల్లోకి మార్కెట్ ప్రవేశించినా సమున్నతమైన సమూహ ఆలోచన మాత్రం మార్కెట్ను కూడా జయించి ముందుకు సాగుతుంది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం ఈ భూగోళంపై ఒక చైతన్య జెండాగా రెపరెపలాడుతుంది. తెలంగాణ అంటే నెత్తుటితో తడిసిన త్యాగాల నేల, త్యాగానికి, తెలంగాణకు విడదీయలేని సంబంధం వుంది. ఇలాంటి త్యాగాల నెత్తుటి చాళ్లల్లో పోరాటాలు పుట్టిపెరిగాయి. ఇప్పుడు తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం శ్రీకాంతాచారి ఒంటిమీద మంటై ఆత్మబలిదానమై తెలంగాణ పటమంతా భగ్గుమంది. నేతలంతా తమ అధికారమత్తులో మునిగిపోయి వుంటే తల్లడిల్లిన తెలంగాణ శ్రీకాంతాచారిగా ముందుకు వచ్చి ఆత్మబలిదానం చేసుకొని రాజకీయపార్టీల కళ్లు తెరిపించింది. యాదయ్య, యాదిరెడ్డి, కానిస్టేబుల్ మల్లన్న.. ఒకరా.. ఇద్దరా.. 850 మందికి పైగా తెలంగాణ బిడ్డలు ఆత్మబలిదానాలు చేసుకుని తెలంగాణ రాష్ట్రం కోసం సమిధలుగా మారారు. తెలంగాణ ఉద్యమానికి తమ ప్రాణాన్ని అర్పితం చేసుకొని తెలంగాణ రాష్ట్ర సాధన మంటలను రగిలించారు. ఆత్మబలిదానాలతో తెలంగాణ నేల భగ్గుమంటుంది. తల్లుల కడుపుకోతతో ఈ నేలంతా గుక్కపట్టి రోధిస్తోంది. అయినా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గుర్రుకొట్టి మొద్దు నిద్రపోతున్నాయి. తెలంగాణలోని