
OH JEEVITHAMA RELAX PLEASE-125
₹125
In stock · 10 available
PublisherPRASANNA TRUST
LanguageTelugu
ముందుమాట "విఫలం అంటే విజయాన్ని వాయిదా వెయ్యడమే" “ప్రపంచం పరాజయాన్ని మన్నిస్తుంది, కానీ అవకాశాన్ని ఉపయోగించుకోలేని వాళ్ళని క్షమించదు". ఈ పుస్తకంలో మనల్ని ఆలోచింపచేసే విషయాలు ఎన్నో ఉన్నాయి. స్వామీ సుఖ బోధానందగారు నిగూఢమైన వేదాంత సత్యాల్ని పంచదార గుళికల్లో మనకీ పుస్తకంలో అందించారు. అసలు ఈ పుస్తకం పేరే సరళంగా, కూతూహలాన్ని రేకెత్తించేలా ఉంది. ఈ రచన అల్లా, కృష్ణుడు, క్రీస్తు, బుద్ధుడు, మహావీరుడు లాంటి మహా మహుల బోధనల సారాన్ని అందిస్తుంది. అంతేకాక, వారికి ఊరట కలిగిస్తూ, రోజూ ఎదుర్కొనే సమస్యలకు పరిష్కారాలు సూచిస్తుంది. రోజువారీ సమస్యలతో సతమతమై పోకుండా, వీటిని ఒక ఛాలెంజ్ తీసుకొని, అర్థవంతంగా పరిష్కరించుకునే మార్గాలు ఇందులో ఉన్నాయి. ఇదొక వినూత్న ప్రయత్నం రోజువారీ అనుభవాల్లోంచి ఉదాహరణలు తీసుకుని స్వామీజీ చెప్పే జీవిత సత్యాలు పాఠకుల్లో ఆలోచనలు రేకెత్తిస్తాయి. మనస్సుకు హత్తుకునేలా ఉన్న ఈ విషయాలు ఎటువైపు నుంచి చదివినా అరటి పండు ఒలిచిపెట్టినట్టు అర్థమయిపోతాయి. ఎంత తిన్నా తియ్యనే! ఇందులోని విషయాలు జీవితం ఎంత విలువైనదో విప్పిచెప్తుంది. వీటిని చదివి, ఆకళింపు చేసుకుని, ఆచరణలో పెడ్తా, అందరూ ప్రశాంతంగా జీవించవచ్చు అన్నది అక్షర సత్యం!