OKA ASAMBADDHA NIJAM by SEELA VEERRAJU Telugu book cover

OKA ASAMBADDHA NIJAM

by SEELA VEERRAJU

₹80
In stock · 24 available
PublisherSEELA VEERRAJU
LanguageTelugu
నా చిర్నామా పచ్చని ఆకులు పండి రాలిపోయినా ఎంతమాత్రం చెట్టు దిగులు చెందనట్టే జ్ఞాపకాలు మసకబారి చేతివేళ్ళు పట్టుసడలి కాళ్ళు సాగక చతికిలబడి వయసు వార్ధక్యంలోకి తోసేసినా మనస్సింకా నిబ్బరంగానే వుంది పచ్చపచ్చని ఆలోచన్ల చివుళ్ళు ఎప్పట్లాగే తొడుగుతూనే వుంది ఇంద్రధనుస్సు రంగుల్ని అద్ది ఆకుల్లో నక్కిన గొంగళిపురుగుల్ని ఎగరేసి అడపాతడపా రంగుల ప్రపంచాన్ని కేన్వాసుల మీదకి పరుస్తూనే వుంది మరణానికి చేరువౌతున్నా మరణభయాన్ని ఆమడదూరానికి నెట్టేస్తే నిర్వేదం నిర్లిప్తత చుట్టుముట్టవు ఉత్సాహం చైతన్యం మనసుని వొదలక సృజనశీలతకి ఏ ఆటంకమూ వుండదు అప్పుడేకదా అక్షరాల పరిమళాలూ ఇంద్రధనుస్సు రంగుల సోయగాలూ చేతివేళ్ళ కొసల్లోంచి బైటికి ప్రవహిస్తూ వుంటాయి