OKA BHARGAVI RENDU PRAYANALU AMERICA GUJARAT by DR BHARGAVI Telugu book cover

OKA BHARGAVI RENDU PRAYANALU AMERICA GUJARAT

by DR BHARGAVI

₹100
In stock · 57 available
PublisherDR.BHARGAVI
LanguageTelugu
నా మాట ఈ చిన్న మానవ జీవితంలో సాధ్యమయినంత వరకూ ప్రపంచాన్ని చూసి, ఆ జ్ఞాపకాలను మూటగట్టుకుని, తలుచుకుని మురిసి పోవడం కంటే మనం సాధించగలిగేదేమీ తేదీ నా అభిప్రాయం. అందుకే వీలయినప్పుడల్లా భద్ర జీవితం నుండి తప్పించుకుని ప్రయాణాలు చేస్తూ వుంటాను. 2000 సంవత్సరంలో తొలిసారిగా అమెరికా ప్రయాణం తలపెట్టినప్పుడు, దివాన్నీ సమయాన్నీ అపురూపంగా కాస్త కాస్తగా కూడబెట్టుకుని మరీ ఆ యాత్ర ప్లాన్ చేసుకున్నాను కానీ ఆ యాత్రలో చూడాలనుకుని తపించిన ఆర్ట్ మ్యూజియమ్స్ చూడలేక పోయాను. స్వదేశానికి తిరిగి రాగానే జ్ఞాపకాలు నెమరు వేసుకునే కనీస వెసులుబాటే చెకుండా అనారోగ్యం పాలవ్వడమే కాక, జీవితంలోనూ అతి చీకటి దశనెదుర్కోవలసి వచ్చింది. ఇంతకాలం తరువాత రెండోసారి 2019లో మళ్లీ అమెరికాలో అడుగు పెట్టినప్పుడు నా మనసు చాలా జాగ్రత్తగా తెరిచి వుంచుకున్నాను, ప్రతి క్షణం కళ్లు విప్పార్చుకుని అక్కడి వింతలూ, విశేషాలూ గమనిస్తూ, చూడాలనుకున్న ఆర్ట్ మ్యూజియమ్స్న సందర్శించి ఆ కళావాటికలకు సంబంధించిన సమాచారాన్ని, ఆ చిత్రకారుల చిత్రరచనా పోకడలని, వారి మనసు పలికిన ప్రతి వర్ణాకృతి సంభ్రమాన్ని మనసుకు వీలయినంత హత్తుకునే ప్రయత్నం చేశాను. అనుకోకుండా ఆరోగ్యానికి కొద్దిపాటి అవరోధం కలిగినప్పటికీ విజయవంతంగా అనుకున్న ప్రదేశాలన్నీ చూడగలిగాను. దేశానికి మరలి వచ్చి సోషల్ మీడియాలో నా అనుభవాలని పంచుకుంటున్నప్పుడు అవి చదివిన మిత్రులు సాధారణ యాత్రా కథనాల రచనా పద్ధతికి భిన్నంగా నేను అక్కడి ఆర్ట్ గ్యాలరీల గురించిన, ఆ మహా చిత్రకారుల గురించిన సమాచారం తెలపడం నచ్చిందనీ, ఈ వ్యాసాలన్నీ ఒక పుస్తకంగా వస్తే బాగుంటుందనీ ప్రేమతో సూచించారు. విదేశ ప్రయాణంతో పాటు, స్వదేశ ప్రయాణ మొకటి జతచేస్తే బాగుంటుందనిపించి 2019లోనే నేను చేసిన గుజరాత్ ప్రయాణపు అనుభవాలని కూడా ఈ పుస్తకంలో పొందు పరిచాను.