
OKA DEEPAM KAVITHA SAMPUTI
by JETTIGUNDLA RANGHUNATHA REDDY
₹20
In stock · 35 available
PublisherKIRANKISHORE PRACHURANALU
LanguageTelugu
జెట్టిగుండ్ల రఘునాథరెడ్డి కవితల్లో ఆర్ద్రమైన భావుకత ఉంది. సునిశితమైన అభివ్యక్తి చతురత ఉంది. 'బాల్యం' అనే శీర్షికతో రఘనాథరెడ్డి రచించిన కవిత అతని వర్ణనాశక్తికి చక్కని తార్కాణం. "బాల్యం వొక ఊయల వొక వెన్నెల” అంటూ ప్రారంభమైన ఈ కవిత ఎన్నెన్నో జీవన పార్శ్వాలను స్పృశిస్తూ "బాల్యం వొక కమ్మని కల గుండె సంద్రంలో గుబాళించే అల” అంటూ ముగుస్తుంది. ఇలా ఎన్నో వచన కవితల్లో తన ప్రతిభను ప్రదర్శించిన రఘనాథరెడ్డి వివిధ సందర్భాల్లో గానయోగ్యంగా ఉండే గీతాలనూ రచించాడు. “సారాయి కొట్టొద్దురో” ఆ కోవకు చెందిన గీతమే. వచన కవితలతో పాటు లయ స్పర్శ ఉన్న కవితలు కూడా ఈ సంపుటిలో చోటు చేసుకున్నాయి. ఈ కవితా సంపుటిని రూపొందించిన జె.రఘునాథరెడ్డిని ఆశీఃపూర్వకంగా అభినందిస్తున్నాను. డా.సి.నారాయణ రెడ్డి