OKA HIJRAKATHA by PARAVASTU LOKESWAR Telugu book cover

OKA HIJRAKATHA

by PARAVASTU LOKESWAR

₹80
In stock · 18 available
PublisherGANDHI PRACHURANALU
LanguageTelugu
దక్కనీ సుస్వరాల గుభాళింపు సాహిత్య సృజనే కాదు, అనుసృజన కూడా వొక కళే. అనుసృజన అనువాదంకన్నా కొంత మేరకు భిన్నమైంది. అనువాదంలోకన్నా అనుసృజనలో వొకరకంగా స్వేచ్ఛ వుంటుంది. అది కళాత్మక వ్యక్తీకరణకు చెందిన స్వేచ్ఛ. ఆ స్వేచ్ఛని యెంత వరకు వుపయోగించుకోవాలన్నది రచయిత భాషా ప్రతిభావ్యుత్పత్తుల మీద, ఎరుక మీద ఆధారపడి వుంటుంది. అవి నిండుగా వున్నప్పుడు అనుసృజన మూలానికి వొదిగి వుంటూ కూడా స్వతంత్ర రచనలా గోచరిస్తుంది. అనువాద స్వేచ్ఛా పరిధిని మరింత విస్తృత పరచుకొంటే స్వేచ్ఛానువాదం అవుతుంది. అప్పుడది భావానువాదమే అవుతుంది గానీ భాషానువాదం కాదు. 20వ శతాబ్దం తొలిదశలో బెంగాలీ, రష్యన్ భాషల నుంచి చేసుకొన్న అనువాదాల దగ్గర్నుంచీ, వివిధ భాషల నుంచి యిటీవల వరకు వస్తున్న స్వేచ్ఛానువాదాలు, అనుసృజనల వరకూ తెలుగులో సృజనాత్మక సాహిత్యానువాదం తక్కువేం కాదు. అయితే స్వతంత్ర రచనల్లా కనిపించే అనువాదాలే కాలగతిలో నిలిచి వుంటాయి. అందుకే లోకేశ్వర్ తన యీ కథల్ని అనువాదం అనకుండా అనుసృజన అంటున్నాడు. అనుసృష్టికి గానీ ముందు నిజానికి యీ కథలకిగానీ, కథకులకీ మాటలో, పరిచయవాక్యాలో అవసరం లేదు. కానీ లాజ్వంతి, షంషాద్ బేగం, అన్వర్ భాయీల వంటివారి విశిష్ట వ్యక్తిత్వాలు చదివాకా, అంటరాని జైతా, ప్రణయభావకవి మీర్ తకీ మీర్, మానవతావాది నిహాల్ సింగ్ల నోట ఢిల్లీ చరిత్ర విన్నాకా, వీటన్నిటినీ మన భాషలోకి అందించిన లోకేశ్వర్ రచనా సంవిధానం చూశాకా కల్గిన అనుభూతిని తోటి పాఠకులతో పంచుకోకుండా వుండలేని చాపల్యం నుంచి యీ నాలుగు మాటలు రాస్తోన్నా.