OKA JEEVITHAM KONNI KALALU by AKUNURI HASAN Telugu book cover

OKA JEEVITHAM KONNI KALALU

by AKUNURI HASAN

₹150
In stock · 25 available
PublisherAKUNURI HASAN
LanguageTelugu
అయిదు దశాబ్దాల కిందటెప్పుడో ఒంగోలులో మొదటిసారి ఊపిరి పీల్చింది. అప్పుడేమో కానీ-ఇంతవరకూ దేనికీ వెక్కిళ్లతో ఏడ్చింది లేదు. అయినా అప్పుడప్పుడూ ఎందుకో తెలీని దుఃఖం, బాధ మాత్రం ఉంటాయి. ఎవరి మీదా విపరీతమైన కోపం కలగదు. అపారమైన ప్రేమా ఉండదు. అసలు పేరు ఆకునూరి సుబ్రమణ్యేశ్వరరావు. తాత, తండ్రీ డాక్టర్లే. అమ్మ ఫోర్స్తో లాయర్ అవాల్సివచ్చింది. మధ్యలో జర్నలిజం. అన్నీ పార్టమ్. జీవితంలోనూ, దేనిలోనూ సీరియస్ ఇన్వాల్వ్ అవలేదు. మూడు దశాబ్దాలు దాటింది. బాపట్ల లోనే ఆగిపోయి. అప్పట్నించి ఎక్కడికీ కదల్లేదు. వెళ్లాలనిపించదు. తిరగాలనిపించదు. చూడాలనిపించదు. వెళ్లినా ఒకట్రెండు రోజులు - శ్వాసలాంటిది ఇక్కడ మర్చిపోయినట్లుగా తిరిగి వచ్చేదాకా అనీజీనెస్. అని. ఎప్పుడూ ఏవో కలలు చుట్టు ముట్టినట్లో... అశాంతీ, ఆరాటం... ఇలాకాదు. ఇదికాదు జీవితం ఏవో కొండలూ, లోయలూ, అడవీ, పెద్దచెట్లు, మెలికలు తిరిగే కాలిబాట, కొండవాగు ప్రవాహం, పక్షులు, అరుపులూ, కదిలేమబ్బులు, ఎండ, చెట్ల నీడలూ, ఆకాశపునీలం, సముద్రం, అలలూ, విశాలమైన తీరం... అన్నీ ఎప్పుడూ కళ్లలో మెదుల్తుంటాయి. అక్కడికి ఎప్పుడా! అనే మార్మికమైన ఆలోచన తరచు కలుగుతుంటుంది. చాలాసార్లు ఎవరితో మాట్లాడకుండా, ఒంటరిగా గంటలు గడుపుతూ... పుస్తకం చదివినా, అక్షరాల మధ్యే కళ్లు ఆగి, ఆలోచన ఎటో జారిపోతుంటుంది. చావంటే భయం లేదు. అలాగని చావాలనే కోరికా, చాలాకాలం బతికే ఉండాలనే వాంఛా... రెండూ లేవు. ఏళ్లు గడుస్తున్న కొద్దీ... చుట్టూ ఏర్పడిపోయిన షెల్లోంచి అప్పుడప్పుడు బయటకొచ్చి చూస్తూ, వెతుకుతూ, మళ్లీ అంతలోనే లోపలికి ముడుచుకు పోతూ... ఎప్పుడూ ఎదురు చూస్తూ, అప్పుడప్పుడు ఎమోషనల్ అవుతూ... ఎప్పుడన్నా రాస్తూ... నాలోంచి, లోకంనుంచీ డిటాచ్ అవుతూ... ఇలా జీవిస్తూ...