
OKA KATHAKUDU NURUGURU VIMARSHAKULU
₹400
In stock · 4 available
PublisherSOUBHAGYA PRACHURANALU
LanguageTelugu
ముందుమాట సుప్తాస్థికలు డాక్టర్. కండెపెనేని సత్యవరప్రసాద్ వివిధ చారిత్రక దశల్లో ఉన్న ప్రజల మధ్యా, ఒకే దశలో ఉన్న వివిధ తరాల మధ్యా సాహిత్యం ఒక వారధిగా నిలుస్తుంది. ఆత్మీయతనీ, అవగాహననీ విస్తరింప జేస్తుంది. సాహిత్యానికున్న వివిధ సామాజిక ప్రయోజనాల్లో ఈ ప్రయోజనం అత్యంత ప్రధానమయ్యింది. ఒక సామాన్య పాఠకుడిగా నాకున్న అభిప్రాయం ఇది. రఘు కూడా స్థూలంగా నా అభిప్రాయంతో ఏకీభవిస్తాడు. అంతేకాదు "నేనెందుకు రాశాను? ఆ రాతల పర్యవసానాలు ఏమిటి? అన్న విషయాలు నాకంటే మా తిలక్ (రఘోత్తం కుమారుడు) ఎక్కువ పట్టించుకోవాలి? అతనికీ, అతని తరానికి చెందిన యువతీ, యువకులకీ ఈ విషయాలు క్షుణ్ణంగా అర్థం కావాలి అన్నది రఘు ఆకాంక్ష, అందుచేతనే వ్యయప్రయాసలకోర్చయినా సరే తన ఇరవైమూడు ముద్రిత కథలపైనా ఏడు ఆశుకథల పైనా వచ్చిన నూట ఎనభై విమర్శలనీ సంకలించి వెబ్లో ఉంచుతున్నాడు. అతడి ఇరవైమూడు ముద్రితకథలు 'కినిగె. కాం'లో లభ్యం అవుతున్నాయి. ఏడు ఆశుకథలు www.thummetiraghothamareddy.comలో లభ్యమౌతున్నాయి. ఈ విమర్శనా వ్యాసాలను పుస్తకరూపంలో కూడా అతను తీసుకువస్తున్నాడు. ఆ పుస్తకపు ముఖ చిత్రంలోని మగువలాగానే, సమాజం సాహిత్య దర్పణంలో తననితాను చూసుకోవాలని, చక్కదిద్దుకోవాలని రఘు అభిలాష. సుప్తాస్థికల నుండి (fossils నుండి) నేర్చుకుని జీవపరిణామ శాస్త్రం (evo-lutionary biology) చాలా అభివృద్ధి చెందింది. అట్లాగే సాహితీ విమర్శల నుండి భావి సామాజికశాస్త్రవేత్తలు, భావి చరిత్రకారులు కూడా ఎన్నో విషయాలు అర్థం చేసుకోవచ్చు. ఇది సాహితీ విమర్శ వల్ల ఒనగూడే ఒకానొక అదనపు ప్రయోజనమే కావచ్చు. కానివ్వండి ఏ విమర్శనీ 'విస్మృత' విమర్శగా ఉండనీయ గూడదు. విమర్శపై చర్చ నిరాటంకంగా కొనసాగుతూ ఉండవలసిందే అనేది నా అభిప్రాయం. వాస్తవానికి వచన సాహిత్యపు ప్రధానోద్దేశ్యమే విషయాలని విశదం చేయడం. ఆ పిదప చర్చకు పెట్టడం. ఐతే ఆ చర్చ విషయాలపై నుండి మరలి రచయితని పొగడే వైపుకో తెగడే వైపుకో పయనించడం మంచిదికాదు వెనక్కి తిరిగి చూసుకొంటే ఆశ్చర్యం వేస్తుంది. ఒక రచయితని దాదాపు నూటయాభై మంది విమర్శకులు నిర్దాక్షిణ్యంగా విమర్శించారా? కళ, ప్రపంచానికంతా అర్థమయ్యే భాష టాల్స్టాయ్