OKA MAATA by C.C.REDDY Telugu book cover

OKA MAATA

by C.C.REDDY

₹100
In stock · 3 available
PublisherC.C.REDDY
LanguageTelugu
సి.సి.రెడ్డి సి.సి.రెడ్డిగారు, విసు సంస్థల అధిపతిగా తెలుగు ప్రజలకు చిరపరిచితులైన చవ్వా చంద్రశేఖర రెడ్డి అడ్వకేట్గా తమ వృత్తి జీవితాన్ని ప్రారంభించారు. భారత కమ్యూనిస్టు పార్టీ సభ్యుడిగా, కార్మిక సంఘాల నాయకుడిగా అనేక ఉద్యమాలను, ప్రజాహిత కార్యక్రమాలను నిర్వహించారు. కార్మిక నాయకుడిగా వీరు చేపట్టిన ప్రతి కార్యక్రమం ఒక సంచలనం. వి.కె. కృష్ణమీనన్ తదితరులతో కలిసి వివిధ దేశాలలో జరిగిన అంతర్జాతీయ న్యాయ సమావేశాల్లో పాల్గొన్నారు. 1973లో అమెరికా వెళ్ళి పదేళ్ళపాటు వ్యాపార రంగంలో ఉన్నారు. ఆ సమయంలో యు.ఎస్. చాంబర్ ఆఫ్ కామర్స్, ఆస్ట్రేలియన్ చాంబర్ ఆఫ్ కామర్స్, యు.ఎస్. టెక్నాలజీ ట్రాన్స్ఫర్ సొసైటీలలో సభ్యులు. 1983లో తిరిగి మాతృభూమికి వచ్చి 'విసు' సంస్థను స్థాపించారు. కొన్ని వేల మంది విద్యార్థులకు విదేశాల్లో, చదువుకునే అవకాశం కల్పించారు. 'విసు' సంస్థ ఎడ్యుకేషన్, సాఫ్ట్వేర్, మాన్యుఫాక్చరింగ్, రియల్ ఎస్టేట్, సినిమా, మీడియా తదితర రంగాలకు విస్తరించి అంతర్జాతీయ గుర్తింపు పొందింది. ఐదు ఖండాలలోని 20 దేశాలలో 'విసు' కార్యాలయాలు ఉన్నాయి. సుమారు రెండు వేల మంది ఉద్యోగులు పని చేస్తున్నారు. 'విసు'ది సూర్యుడు అస్తమించని వ్యాపార సామ్రాజ్యం. సి.సి.రెడ్డి విద్యార్థి దశలోనే కొన్ని పత్రికలు నడిపారు. 'సవ్యసాచి', 'తెలుగు స్వతంత్ర' మొదలైన పత్రికల్లో వ్యాసాలు, కథలు, కవితలు రాశారు. రా.రా., కొడవటిగంటి, శ్రీశ్రీ లాంటి సన్నిహితుల సాహచర్యంతో సాహిత్యంపట్ల మక్కువ పెంచుకున్నారు. వివిధ రాజకీయ వ్యవస్థలను సునిశితంగా పరిశీలించిన సి.సి. రెడ్డి, మన రాజకీయ వ్యవస్థలో కొన్ని మార్పులు రావాలని ఆశిస్తారు. ఆయన ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వానికి విదేశీ పెట్టుబడుల సలహాదారుగా ఉన్నారు. దక్షిణ భారత హిందీ ప్రచార సభ వైసీఛాన్సలర్. పేదరికం నుంచి సంపదలోకి, సంపద నుంచి పేదరికంలోకి, మళ్ళీ సంపదలోకి ప్రయాణించిన సి.సి.రెడ్డి మానవ హృదయాన్నీ, శక్తినీ, ఔన్నత్యాన్ని ఆకళింపు చేసుకున్నారు. సామాన్య మానవుడు గౌరవంగా బతకాలని, యాచనలేని సమాజం రావాలని ఆశిస్తారు. కలలు కంటారు. కృషి చేస్తారు.