OKA NULIVECCHANI SPARSHA by CHEEKOLU SUNDARAIAH Telugu book cover

OKA NULIVECCHANI SPARSHA

by CHEEKOLU SUNDARAIAH

₹65
In stock · 2 available
PublisherTELUGU SAHITHEE SAMITHI
LanguageTelugu
అద్వితీయమైన భారతీయ సాహితీ సంపద వైభవాన్ని అనునిత్యం ఆస్వాదించే మిత్రులందరికీ నమస్సులు, ఆదికవి వాల్మీకి మొదలుకొని నేటితరం వారి వరకు కవిత్వం సమాజానికి హితం చేకూర్చాలనే లక్ష్యంతోనే సాగుతోంది. ఆశ్రమాలలోను, ఆశ్రయాలలోను కవిత్వం మానవులకు మార్గదర్శనం చేసే శక్తిని సంతరించుకొంది. నేటికీ ఆ బాధ్యతను అది నిర్వర్తిస్తోంది. ఆధునిక కవులు సైతం వారు ఎంచుకునే వస్తు రూపాలు వేరైనా చైతన్యం కలిగించాలన్న లక్ష్యంతోనే రాస్తున్నారు. ఈ విషయం మనకు ప్రతి కవితలోనూ స్పష్టమవుతోంది. అనునిత్యం నూతనోత్తేజాన్ని జత చేసుకుంటూ సాహితీ వినీలాకాశంలో దేదీప్యమానంగా వెలిగే ప్రయత్నంలో 'రంజని' ఇటువంటి సంకలనాలతో ముందడుగు వేస్తోంది. తెలుగు అక్షరాలకు కొత్త అర్థాలను కల్పించిన స్రష్ట, ద్రష్ట గుంటూరు శేషేంద్ర శర్మపై 'రంజని' ప్రచురించిన శేషేంద్ర శిఖరం' తర్వాత ఈ కావ్యం అందిచడానికి మేం ఎంతో ఆనందిస్తున్నాం. కవిత్వాభిమానులందరూ ఈ కృతి అందుకొని ఆశీర్వదించాలని కోరుతున్నాం.