OKA PILUPULO PILISTE PALUKUTAVATA by JANAKI GANAPATHIRAO Telugu book cover

OKA PILUPULO PILISTE PALUKUTAVATA

by JANAKI GANAPATHIRAO

₹90
In stock · 6 available
PublisherGOLLAPUDI VEERASWAMI SON
LanguageTelugu
తొలిపలుకులు కలియుగ ప్రత్యక్షదైవం శ్రీవేంకటేశ్వర స్వామిపై తిరుమల తిరుపతి దేవస్థానంతో పాటు, భక్తులూ- ఆశ్రిత ఆస్తిక మహాశయులూ ఎందరెందరో వివిధ పుస్తకాలు వెలయించారు. అయితే దాదాపు 80 ఏళ్ల చరిత్ర గల ప్రచురణ సంస్థగా, తెలుగునాట మాకున్న జనాదరణ అనన్యసామాన్యం. అందులోనూ భక్తి సంబంధ గ్రంథాలను అధికంగా ప్రచురించిన సంస్థ మాది. గతంలో శ్రీవారిపై మేము కూడ ఒకటి రెండు చిన్నచిన్న గ్రంథాలను ముద్రించి వున్నాం! కాని శ్రీవారిపై ఒక సమగ్ర గ్రంథాన్ని వెలువరించాలన్న సంకల్పంలో మేముండగా, ఆ శ్రీనివాసుడే మావద్దకు పంపాడా? అన్నట్లుగా శ్రీ జానకి గణపతిరావు అనే భక్తపాద రేణువు- సహృదయులు మావద్దకు తాను జీవితకాలం శ్రమించి వ్రాసిన శ్రీవేంకటేశ్వర స్వామి గ్రంథాన్ని తీసుకొచ్చారు. ఈ గ్రంథంలో విషయ వర్గీకరణ మాకెంతో నచ్చింది. ఒక క్రమపద్ధతిలో ఆయన అందించిన విశేషాలు పాఠకులను తప్పక ఆకట్టుకుంటా యని పించింది. మా సంపాదక వర్గ రచయితల మార్పు చేర్పులతో దీన్ని మీ కంది స్తున్నాం. శ్రీవారి దివ్యచరితం మొదలు తిరుమల తిరుపతి - దాని పరిసరాలలో దర్శించ దగ్గ ఎన్నో పుణ్యక్షేత్రాల వరకూ ఆయన దీనిలో రేఖా మాత్రంగా స్పృశించడం చేత ఇది తిరుపతి పర్యాటకులకు కరదీపికలా కూడా ఉపయోగ పడుతుంది. నిజానికి - ఇందులో చాలా అంశాలు..... దేనికదే ఒక్కొక్కటి విడిగా ఒక గ్రంథంగా మలచవచ్చు! గ్రంథ విస్తరభీతి చేత, దీనిలో ఎక్కడైనా ఏ అంశమైనా చేరకపోయి ఉండవచ్చు! అట్లా అని దీని సమగ్రతకు మేము తీసుకోని జాగ్రత్త అంటూ లేదు. ఏకకాలంలో గాక, అప్పుడప్పుడు సమకూర్చిన సమాచారం వల్ల ఏవయినా లోపాలుంటే క్షంతవ్యులం! మీ ఆదరణాభిలాషులం....