OKA SATHABDI KINDATI MUNDUCHOOPU by N.VENUGOPAL Telugu book cover

OKA SATHABDI KINDATI MUNDUCHOOPU

by N.VENUGOPAL

₹20
In stock · 4 available
PublisherN.VENUGOPAL
LanguageTelugu
ముందుమాట వకుళాభరణం రామకృష్ణ 'దేశభక్తి' గేయ రచన మొదటి పాఠానికి సంబంధించిన మార్పులు, తర్వాతి కాలంలో వచ్చిన అచ్చు పొరబాట్లు, గురజాడ సాహిత్యాన్ని ప్రచురించే క్రమంలో సంపాదకుల 'నిర్లక్ష్యం' వల్ల చోటు చేసుకున్న మార్పులు సూచించడంతో ఈ సుదీర్ఘ ప్రసంగవ్యాసం మొదలైంది. 'మోనోగ్రాఫ్' అనదగిన ఈ రచనని 'గేయ నేపథ్యం', 'గురజాడ అప్పారావు విశిష్టత', 'దేశభక్తిలో ఏముంది?', 'దేశభక్తిపై వ్యాఖ్యలు', 'వంద సంవత్సరాల తర్వాత దేశభక్తి' అనే ఐదు భాగాలుగా విభజించడం అధ్యయన పద్ధతికి అనుగుణంగా, పాఠకులకు అనుకూలంగా వుంది. 'గేయ నేపథ్యం', గురజాడ కాలానికి ముందు వెనకాల, ముఖ్యంగా 20వ శతాబ్ది మొదటి దశకం ప్రాముఖ్యాన్ని- రాజకీయ, ఆర్థిక, సాహిత్య పరంగా సమీక్షించింది. మొత్తం వ్యాసానికి ఇది తలమానికం. రచనా కాలం, సందర్భం, రచయిత స్థల కాలాదులు (టైమ్ అండ్ స్పేస్), జాతీయోద్యమస్థాయి, అందులోని భావజాలం తాలూకు భిన్న దృక్పథాలు, ప్రత్యేకించి ఆంధ్రదేశంలో ఆ దశకంలో పొడసూపుతున్న పరిణామాలు, 'దేశభక్తి' రచనకెలా పూర్వరంగంగా భాసించాయో చెప్పడం, గేయం లోని అంశాలను శాస్త్రీయ రీతిలో గ్రహించేందుకు తోడ్పడింది. ఈ నేపథ్యం, ప్రసంగ వ్యాసానికి తెరతీస్తే, నూరు సంవత్సరాలు పూర్తి